Bigg Boss 7 Telugu: ఆఖరి వారంలో కూడా అతడే టార్గెట్…! శివాజీ గేమ్ ప్లాన్ ఏంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి రోజులు గడుస్తున్నాయి. ఈ సీజన్ కి ఆదివారం గ్రాండ్ ఫినాలేతో స్వస్తి పలకబోతున్నారు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఇంట్లో టైమ్ పాస్ చేస్తున్నారు. ఇది నచ్చని బిగ్ బాస్ వాళ్లకి వార్నింగ్ ఇచ్చాడు. వాళ్లు ఏం చేస్తున్నారో ప్లాస్మా టీవిలో చూపించి, సీజన్ లో ఆఖరి రోజూ వరకూ కూడా ఓటింగ్ జరుగుతుందని, ఇది చాలా కీలకమైన వారం అని హెచ్చరించాడు. నిజానికి ఏలియన్ వచ్చి “హాచ్చి” అంటూ టాస్క్ లు ఇస్తోంది. ఆ టాస్క్ లలో గెలిచిన వాళ్లకి ఇంటి నుంచీ ఫుడ్ ఇస్తోంది. ఇందులో భాగంగానే యావర్ కి ఇంటి నుంచీ ఫుడ్ వచ్చింది. ముగ్గురు టాస్క్ ఆడారు.

కలర్స్ ట్రేని తిప్పుతూ బంతులు అమర్చే ఆటలో అమర్ దీప్ విజయం సాధించాడు. యావర్ ఫుడ్ ని ఇమ్మని చెప్పాడు. కానీ, యావర్ ఆ ఆహారాన్ని అందరితో షేర్ చేసుకుంటానని చెప్పడంతో బిగ్ బాస్ నిరాకరించాడు. కేవలం ఒక్కరితో మాత్రమే చేసుకోవాలని కండీషన్ పెట్టాడు. యావర్ అలాగైతే వద్దని చెప్పడంతో యావర్ ఇంటి ఫుడ్ ని మిస్ అయ్యాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ఇంటినుంచీ వచ్చిన ఫుడ్ ని అమర్ దీప్ తో షేర్ చేసుకున్నాడు. దీనికోసం మరోసారి హౌస్ మేట్స్ బ్యాలన్సింగ్ టాస్క్ ఆడారు. ఇందులో అర్జున్ గెలిచి పల్లవి ప్రశాంత్ ఇంటి ఫుడ్ ని ఇప్పించాడు.

పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ తో కలిసి మటన్ బిర్యానీ ఆస్వాదించాడు. అయితే, ఇక్కడ ప్రతిసారి అమర్ దీప్ ని చులకన చేస్తూ శివాజీ డైలాగ్స్ వేస్తునే ఉన్నాడు. జ్యోతిష్యం పేరుతో వెధవ వెధవ అంటూ చాలాసార్లు అన్నాడు. అమర్ దీప్ జ్యోతిష్యం చెప్తూ టాస్క్ చేస్తుంటే వేళాకోళం చేశాడు. ప్రతి విషయానికి కౌంటర్ వేస్తూ గోల చేస్తునే ఉన్నాడు. అంతేకాదు, కష్టపడి టాస్క్ గెలిచినా కూాడ నువ్వు గెలిచావ్ కాబట్టే, యావర్ కి ఫుడ్ రాలేదంటూ, నీది ఏం హ్యాండ్ రా బాబూ అంటూ కామెంట్స్ చేశాడు. ఇలా ఛాన్స్ దొరికినప్పుడల్లా అమర్ ని ఏదో విధంగా కామెంట్ చేస్తూ బడాయి చూపిస్తున్నాడు శివాజీ.

ఈవిషయంలో అమర్ దీప్ మిగతా ఇంటి సభ్యులకి కూడా లోకువ అయిపోతున్నాడు. జ్యోతిష్యం చెప్పేటపుడు అర్జున్ సైతం వెధవ అంటూ కామెంట్ చేశాడు. అలాగే, యావర్ కూడా కౌంటర్ వేశాడు. ఇలా ప్రతి ఒక్కరిని తక్కువ అయిపోతున్నాడు అమర్. ఈవిషయం తెలిసే శివాజీ కామెంట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఫినాలే ఓటింగ్ కాబట్టి, ప్రతి చిన్న పాయింట్ చాలా అవసరం అని అమర్ ఫ్యాన్స్ వాపోతున్నారు. శివాజీ అవకాశం చిక్కినప్పుడల్లా అతడ్నే టార్గెట్ చేయడం బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, గ్రాండ్ ఫినాలే కోసం హౌస్ మేట్స్ ముస్తాబు అవుతున్నారు.

మేకోవర్ చేసుకుంటున్నారు. ఫైనల్ గా (Bigg Boss 7 Telugu) అమర్ దీప్ పెళ్లిరోజు కావడంతో తన భార్య తేజస్వి తో వీడియో కాల్ మాట్లాడాడు.యాక్టివిటీ ఏరియాలో ఉన్న హాలోగ్రామ్ దర్సినిలో ఈ వీడియో కాల్ ని ఏర్పాటు చేశారు బిగ్ బాస్. ఫినాలే కోసం అందరూ వైయిట్ చేస్తున్నామని కప్ కొడితే వెకేషన్ ప్లాన్ చేద్దామంటూ చెప్పింది తేజస్వి. అమర్ దీప్ తేజుని చూసి కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. ఫైనల్ గా హల్దీరామ్ వాళ్లు ఏర్పాటు చేసిన డిన్నర్ ని పుష్టిగా లాఘించారు హౌస్ మేట్స్. మొత్తానికి అదీ మేటర్.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus