షార్ట్స్ ఫిలిమ్స్ ప్రయోగాలకు అడ్డాగా మారాయి. యువతరం విభిన్నమైన కథలతో లఘుచిత్రాలను రూపొందిస్తోంది. షార్ట్ ఫిల్మ్ మేకర్ అభిమన్యు యానిమేటెడ్ పాత్రలతో సృష్టించిన “ఇన్ లవ్” యూట్యూబ్ వీక్షకుల మనసు దోచుకుంటోంది.
కథ ఏమిటంటే..
రోదసిలో ఒక స్పెస్ షిప్. అందులో అప్పుడే తయారైన బబ్లిస్, హీబా అనే రెండు రోబోలు. తొలి చూపులోనే ప్రేమలో పడ్డాయి. స్పెస్ షిప్ నుంచి షికారుకి వెళదామని అమ్మాయి (రోబో)ని అబ్బాయి రోబో పిలిచాడు. ఆమె రానంది. ఒక్కడే రోదసీలోకి వెళ్లిన వెళ్లి విహరిస్తున్న అబ్బాయిని చిన్న గ్రహ కలశం ఢీకొంటుంది. ఆ ప్రమాదంలో చెయ్యిని కోల్పోతాడు అబ్బాయి. ఇక దాని తర్వాత అమ్మాయి ఏమి చేస్తుందనేది క్లైమాక్స్.
క్రియేటివిటీ..
యంత్రాల మధ్య హృదయాన్ని టచ్ చేసే ప్రేమ కథను నడిపించిన తీరు అద్భుతం. ముఖ్యంగా రోబోల మొహాల్లో ఫీలింగ్స్ ని చిన్న లైట్ల వెలుగుల ద్వారా చూపించడం అభిమన్యు క్రియేటివిటీని బయటపెట్టింది. అతని ప్రతిభకి కెవిన్ సంగీతం తోడవడంతో “ఇన్ లవ్ ” మనల్ని ప్రేమలో పడేస్తుంది. ఇటువంటి సృజనాత్మకమైన చిత్రాలను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే “రన్ వే రీల్” వారి సమర్పణలో వచ్చిన “ఇన్ లవ్ “ని మీరు మిస్ కాకండి.