సోహైల్ ఎందుకు వచ్చాడు ? ఇనయా కావాలనే సోహైల్ జిమ్ లో జాయిన్ అయ్యిందా..? అసలు కారణం ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఇనయా కోసం సోహైల్ వచ్చి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. నిజానికి సోహైల్ కి ఇంకా ఇనయాకి పెద్దగా పరిచయం లేదు. కానీ, ఇనయాకోసం స్టేజ్ పైకి సపోర్టింగ్ గా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇనయా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మణికొండకి షిఫ్ట్ అయ్యి కావాలని సోహైల్ జిమ్ లో జాయిన్ అయ్యానని చెప్పింది. జిమ్ లో వర్కౌట్స్ చేసేటపుడు సోహైల్ వేరే అమ్మాయిలతో మాట్లాడుతుంటే, జెలసీ ఫీల్ అయ్యి వెళ్లిపోయానని చెప్పింది.

ఈవిషయం స్టేజ్ పైన ఇద్దరూ మాట్లాడుకున్నారు. సోహైల్ జిమ్ లో అసలు ఇనయా ఎందుకు జాయిన్ అయ్యిందనేది ఇప్పుడు హాట్ ఆప్ ద టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఇనయా లైఫ్ స్టోరీని తెగ సెర్చ్ చేసేస్తున్నారు నెటిజన్స్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సోహైల్ అంటే తనకి చాలా ఇష్టమని, కేవలం బిగ్ బాస్ సీజన్ 4 చూసినపుడు అభిమానించానని ఇనయా చెప్తోంది. అంతేకాదు, తన జిమ్ లో జాయిన్ అయితే, కొంతమందితో పరిచయాలు అవుతాయి, తద్వారా ఆఫర్స్ వస్తాయని జాయిన్ అయ్యిందట.

తీరా సోహైల్ తో ఫ్రెండ్షిప్ చేద్దామని చూస్తే తను పూర్తిగా బిజీగా ఉండేవాడని ఒక ఇంటర్య్వూలో చెప్పింది ఇనయ. ఇప్పుడు అందుకే ఇనయా కోసం సోహైల్ వచ్చాడు. అంతేకాదు, సోహైల్ సీజన్ 4 లో తనమార్క్ ఆటని చూపించాడు. ఇప్పుడు ఇనయా కూడా అలాగే సీజన్ 6లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆటతీరుని చూపిస్తోంది. వీరిద్దరికీ ఎలాంటి పరిచయాలు పెద్దగా లేకపోయినా ఇప్పుడు సోహైల్ సపోర్ట్ గా రావడం అనేది బిగ్ బాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.

ఇక ఇనయా ప్రస్తుతం కెప్టెన్ అయ్యింది కాబట్టి , ఈవీక్ ఇనయా సేఫ్ జోన్ లో ఉంది. ఇంకోవారం సేఫ్ అయితే నేరుగా టాప్ 5లోకి వెళ్లిపోతుంది. అంతేకాదు, రేవంత్ కి సైతం గట్టి పోటీ ఇచ్చి టైటిల్ రేస్ లో నిలబడింది ఇనయా. మరి ఆఖరి వారం ఓటింగ్ ఎలా ఉంటుంది. సోహైల్ ఇనయాకోసం ఓటింగ్ రిక్వస్ట్ చేస్తాడా ? సోహైల్ ఫ్యాన్స్ ఇనయాని సేవ్ చేస్తారా. విన్నర్ గా నిలబెడతారా అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus