Inaya,Revanth: ఇనయకి తప్పిన ముప్పు..! రేవంత్ చేసిన ఆ పనివల్లే ఇలా జరిగింది..!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఆసక్తికరంగా జరిగింది. ముందుగా బిగ్ బాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా తన కోరికలు తీర్చిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ కోరికలు ఏమైనా ఉంటే చెప్పమని అడిగాడు. ఒక్కొక్కరు వచ్చి తమ మనసులో కోరికలు చెప్పారు. అయితే, ఇక్కడ కొంతమంది తమ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ విషయాలే ఎక్కువగా మాట్లాడారు. ఇది అయిపోయిన తర్వాత కెప్టెన్సీ పోటీదారులని ఎంచుకోమని కెప్టెన్ కీర్తిని ఆదేశించాడు బిగ్ బాస్.

టాస్క్ లో మంచి గా పెర్ఫామ్ చేసిన ఆరుగురు ఇంటి సభ్యులని ఎంచుకోమని వారిని కెప్టెన్సీ పోటీదారులగా చేస్తానని చెప్పాడు. దీంతో కీర్తి బాగా ఆలోచింది, ఫైమా, గీతు, బాలాదిత్య, రేవంత్, సూర్య, ఇంకా రాజ్ పేర్లు చెప్పింది. వీళ్లు కెప్టెన్సీ టాస్క్ ఆడారు. ఇక్కడే గొడ్డలి ఇచ్చి కట్టెని కొట్టే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కట్టె తెగిన తర్వాత పైనున్న గోను సంచిలో నుంచీ బిగ్బాస్ అట్ట ముక్కలు తీసుకుని దానిని సరైన క్రమంలో అమర్చాలి. ఇది ఎవరైతే తక్కువ టైమ్ లో చేస్తారో వాళ్లు తర్వాత లెవల్లోకి వెళ్తారు.

దీంతో హౌస్ మేట్స్ ఆవేశంగా గొడ్డలి తీసుకుని చెక్కని నరకడానికి వెళ్లారు. ఇక్కడే రేవంత్ గట్టిగా గొడ్డలిని చెక్కకి కొట్టాడు. అది చేయి జారి సంచాలక్ అయిన ఇనయవైపు దూసుకెళ్లింది. కొద్దిగా ఉంటే ఖచ్చితంగా తనకి పెద్ద గాయం అయ్యేది. జస్ట్ మిస్ అయ్యింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ అలర్ట్ అయ్యారు. నిజానికి అంతకముందు ఇనయ రాజ్ బిగ్ బాస్ అట్టలని సరైన క్రమంలో పేరుస్తున్నప్పుడు తనకి సలహా ఇచ్చింది. తప్పు పెడుతున్నావ్ అంటూ చెప్పింది. దీన్ని హౌస్ మేట్స్ అబ్జక్ట్ చేయడంతో సైలెంట్ అయిపోయింది.

ఇక తర్వాత అదే ఊపులో వచ్చిన రేవంత్ ఆవేశంగా గొడ్డలి ఇసిరేసరికి ఇలా జరిగింది. ఈ టాస్క్ లో అతి తక్కువ టైమ్ లో సూర్య టాస్క్ ని ఫినిష్ చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత రెండో స్థానంలో బాలాదిత్య ఉండగా, మూడో స్థానంలో ఉండి మరో లెవల్లోకి ప్రవేశించాడు రేవంత్. మిగిలిన ఫైమా, గీతు, ఇంకా రాజ్ ముగ్గురూ కూడా కెప్టెన్సీ టాస్క్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. ఇక రెండో లెవల్లో రేవంత్ గెలిచి 5వ వారం ఇంటి కెప్టెన్ గా అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. అదీ మేటర్.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus