సోహైల్ కు ప్రపోజ్ చేసిన ఇనయ సుల్తానా.. మరి సూర్య సంగతేంటి..?

కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో, సీరియల్స్ లో నటించిన సోహైల్ ‘బిగ్ బాస్ 4 ‘ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ సీజన్ కు ఇతను గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి.! ఎందుకంటే విన్నర్ గా నిలవకుండానే అతను రూ.25 లక్షలు ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. అప్పటి వరకు అలాంటి డెసిషన్ ఏ కంటెస్టెంట్ తీసుకోలేదు. ఇక ‘బిగ్ బాస్ 6’ ద్వారా ఇనయ సుల్తానా కూడా 6 ద్వారా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా..

బిగ్ బాస్ హౌస్ లో అప్పటి వరకు ఆర్జే సూర్యతో రొమాన్స్ చేసిన ఇనయ సుల్తానా… సడన్ గా సోహైల్ అంటే ఇష్టం అని చెప్పి అందరికీ షాకిచ్చింది. అంతేకాదు ఇనయకి సపోర్ట్ చేస్తూ హౌస్ లోకి కూడా వెళ్ళాడు సోహైల్. ‘కేవలం సోహైల్ కోసమే నేను అతను వెళ్లే జిమ్ లో జాయిన్ అయ్యాను. ఆ టైంలో అమ్మాయిలు అతనితో మాట్లాడుతుంటే నేను జలస్ ఫీలయ్యే దాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది ఇనయ.

ఇదిలా ఉండగా.. తాజాగా అతనికి ప్రపోజ్ చేసి అందరికీ షాకిచ్చింది ఇనయ. ‘నాకు నువ్వంటే చాలా ఇష్టం ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్నే ప్రేమిస్తా’ అంటూ ఇనయ.. సోహైల్ కు ప్రపోజ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ‘మీది బెస్ట్ జోడి.. త్వరగా పెళ్లి చేసుకోండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

ఇది నిజంగా జరిగిందా లేక ప్రమోషన్లో భాగంగా చేసిందా అన్నది తెలియాల్సి ఉంది. పైగా ‘వెయిట్ ఫర్ సోహైల్ రెస్పాన్స్’ అంటూ వీడియో చివర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సోహైల్ నటించిన ‘లక్కీ లక్ష్మణ్’ అనే మూవీ డిసెంబర్ 30న విడుదల కాబోతుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus