ప్రముఖ హీరోయిన్ తాప్సి ఇంటిపై ఈరోజు ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఆమెకి సంబంధించిన ఆస్తులపై ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ దాడులు నిర్వహించింది. అయితే ఈ విషయం అధికారికంగా బయటకి రానప్పటికీ.. ముంబైలో తాప్సికి చెందిన రెండు ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేతకు సంబంధించి ఈరోజు ముంబై, పూణేలలో దాదాపు 22 ప్రదేశాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ లిస్ట్ లో తాప్సితో పాటు దర్శకుడు అనురాగ్ కశ్యప్,
నిర్మాత మధు మంతెన, వికాస్ బాహెల్ కూడా ఉన్నారు. అనురాగ్ కశ్యప్ కి చెందిన ఫాంటమ్ ఫిలిమ్స్ లావాదేవీలకు సంబంధించి ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అలానే ప్రముఖ సెలబ్రిటీ మేనేజ్మెంట్ కంపెనీ క్వాన్ పై కూడా దాడులు జరిగాయి. దర్శకనిర్మాత విక్రమాదిత్య మొత్వానే ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. రీసెంట్ గా కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు అనురాగ్ కశ్యప్, తాప్సి మద్దతుగా నిలిచారు.
అలానే పౌరసత్వం సవరణ చట్టంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వీళ్ల నివాసాలు, ఆఫీసులపై ఐటీ దాడులు జరగడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Most Recommended Video
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!