ఐటీ అధికారుల నెక్స్ట్ టార్గెట్ ఈ సినీ స్టార్లే..!

ఎవ్వరూ ఊహించని విధంగా నవంబర్ 20 న కొందరి సినీ సెలెబ్రిటీల ఇళ్ళు మరియు ఆఫీస్ ల పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని తో సహా ‘జెర్సీ’ నిర్మాత అయిన ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ ఆఫీస్ పై కూడా సోదాలు నిర్వహించారు. చెల్లించాల్సిన టాక్స్ లెక్కల్లో తేడాలు రావడం వల్లే ఇలా సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. వీరితో పాటు ఐటీ అధికారులు మరికొంత మంది సినీ సెలెబ్రిటీలను టార్గెట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి.

వీరిలో ‘సురేష్ ప్రొడక్షన్స్’ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు తో పాటు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారి పై కూడా ఈ ఐటీ దాడులు జరుగబోతున్నాయని సమాచారం అందింది. వీరితో పాటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ’14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్’ రామ్, గోపీచంద్… ‘ఏకే ఎంటర్ టైన్ మెంట్స్’ అనిల్ సుంకర్ పేర్లు సెకెండ్ లిస్ట్ లో ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. మరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus