Game Changer: ఉదయనిధి మాటలు.. దిల్‌ రాజుకు చిక్కులు.. ఏం చేస్తారో మరి?

ప్రతి సంవత్సరం సంక్రాంతికి దిల్‌ రాజు ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి ఓ సినిమా ఉంటుంది. అది ఆయనకు అనవాయితీ మారిపోయింది. తన ప్రొడక్షన్‌ నుండి సినిమా రాకపోతే తన పంపిణీలో అయినా సినిమా ఉండేలా చూసుకుంటారు ఆయన. అయితే వచ్చ ఏడాది ఈ పరిస్థితి లేదా? ఏమో పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. దీనికి కారణం సంక్రాంతికి వస్తాయి అనుకుంటున్న సినిమా వచ్చేలా లేదు. పోనీ మరో సినిమాను తీసుకొద్దాం అంటే అది ఇంకా రెడీ కాలేదు.

రాదనుకుంటున్న సినిమా ‘ఇండియన్‌ 2’ అయితే, కష్టం అనుకుంటున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. ప్రముఖ దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఒకవైపు రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాను ఫుల్‌ స్వింగ్‌లో తీసుకెళ్తుంటే.. ఎప్పుడో ఆగిపోయిన కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌ 2’ వచ్చి బ్రేక్‌ లేసింది. ఆ సినిమాను తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఆ సినిమాను తొలుత అనుకున్నట్లు సంక్రాంతికి వచ్చే పరిస్థితి లేదు.

(Game Changer) ఈ సినిమాను 2024 సమ్మర్‌కి తీసుకొస్తాం అని నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్‌ చెప్పారు. దీంతో ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేద్దాం అనుకున్న దిల్‌ రాజు సంక్రాంతికి మరో సినిమా వెతుక్కోవాల్సి వచ్చింది. పోనీ ఈ సినిమా రాదంటున్నారు కదా శంకర్‌ సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ను తీసుకొద్దాం అంటే ఇప్పుడిప్పుడే ఆ సినిమా అయ్యేలా లేదు. ఓవైపు శంకర్‌ ‘ఇండియన్‌ 2’ పనుల్లో ఉంటే, మరోవైపు రామ్‌చరణ్‌ వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉన్నారు.

దీంతో ఈ సినిమా ఎప్పుడవుతుందో చెప్పలేం అంటున్నారు. ఈ లెక్కన ఈ సినిమా సంక్రాంతికి కష్టమే అంటున్నారు. ఇప్పుడు వేసవికి ‘ఇండియన్‌ 2’ వస్తే మరి ‘గేమ్‌ ఛేంజర్‌’ ఎప్పుడు తెస్తారు అనేదే ప్రశ్న. మళ్లీ ఈ సినిమాను ఏ దసరాకో, దీపావళితో తీసుకు రావాల్సి వస్తుంది. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం చరణ్‌ ఫ్యాన్స్‌ ఎంత అడుగుతున్నా ఇవ్వకపోవడానికి ఇదే కారణం అంటున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus