‘ఇండియన్’ ఓ కల్ట్ బ్లాక్ బస్టర్. ‘ఇండియన్ 2’ పెద్ద డిజాస్టర్. ఇది అందరికీ తెలిసిందే. అయితే ‘ఇండియన్ 2’ రిలీజ్ టైంలోనే ‘ఇండియన్ 3’ షూటింగ్ కూడా 80 శాతం కంప్లీట్ అయిపోయింది అని తెలిపారు. అసలు కథ మొత్తం ‘ఇండియన్ 3’ లోనే ఉంటుంది అని దర్శకుడు శంకర్ చెప్పడం జరిగింది. అయితే తెలుగులో పార్ట్ 2 కనుక ప్లాప్ అయితే పార్ట్ 3 చేయడానికి దర్శకనిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించరు. కానీ హాలీవుడ్లో ఈ సంస్కృతి ఉంది.
అక్కడ 2వ పార్ట్ ప్లాప్ అయినా.. 3వ పార్ట్ తీస్తారు. బాలీవుడ్లో కూడా ఈ మెథడ్ ఫాలో అయ్యారు. కానీ సౌత్ లో ఇప్పటి వరకు అలాంటిది లేదు. కానీ ‘ఇండియన్ 3’ తో శంకర్ ఆ ఫార్ములా అప్లై చేసే అవకాశం ఉంది. కాకపోతే ఒక్కటే సమస్య. ‘ఇండియన్ 2’ ప్లాప్ అయ్యింది కాబట్టి.. ‘ఇండియన్ 3’ పై పెట్టుబడి పెట్టడానికి బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించరు.
అంతేకాదు.. ‘ఇండియన్ 3’ కంప్లీట్ అవ్వాలంటే ముందు నిర్మాతలైన ‘లైకా’ వారు మరికొంత బడ్జెట్ పెట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలి. అందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. మరోపక్క ‘లైకా’ వారికి కమల్ హాసన్ కి కూడా మనస్పర్థలు ఉన్నాయి. కాబట్టి.. ఇది తెగే వ్యవహారం కాదు. అందుకే శంకర్ తరఫున రజినీకాంత్ ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది. కమల్ , లైకా వారితో రజినీకాంత్ కి మధ్య మంచి స్నేహం ఉంది. కాబట్టి.. రజినీకాంత్ ఇద్దరితో మాట్లాడి.. ‘ఇండియన్ 3’ కంప్లీట్ అయ్యేలా చేస్తారని దర్శకుడు శంకర్ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.