నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ 2′ రూపొందుతుంది. ఈ మధ్యనే టీజర్ వదిలారు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ’14 రీల్స్ ప్లస్’ సంస్థపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్..తో రూపొందుతున్న మూవీ అని చెప్పాలి. ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపు రూ.160 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాని ఇక ఏక కాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ‘అఖండ 2’ రిలీజ్ డేట్ కే పవన్ కళ్యాణ్ ‘ఓజి’ కూడా రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో ‘అఖండ 2’ వాయిదా పడే అవకాశం ఉంది అని అంతా అనుకున్నారు. కానీ అందులో నిజం లేదని సెప్టెంబర్ 25 కే ‘అఖండ 2’ వస్తుందని నిర్మాతలు పోస్టర్స్ తో కన్ఫర్మ్ చేస్తూనే ఉన్నారు.
ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆగస్టుకి ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది అని వారు అంటున్నారు. కానీ ఇన్సైడ్ టాక్ వేరుగా ఉంది. షూటింగ్ దాదాపు కంప్లీట్ అయినా.. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పెండింగ్ ఉందని.. కాబట్టి సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని.. వారు చెబుతున్నారు. మరోపక్క డిసెంబర్ 9 డేట్ ను కూడా ‘అఖండ 2’ నిర్మాతలు పరిశీలిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఎక్కువ శాతం ‘అఖండ 2’ సెప్టెంబర్లో అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు లేనట్టే చెప్పాలి.