Indian 3: షాకింగ్ న్యూస్: ఆ సినిమా రెండో సీక్వెల్ ఉందట.. అవసరమా అధ్యక్ష
- September 11, 2026 / 07:29 PM ISTByFilmy Focus Desk
ఓ రెండేళ్ల క్రితం వరకు ‘ఇండియన్’ / ‘భారతీయుడు’ అంటే ఓ గొప్ప సినిమా. ఇప్పటికీ ఆ సినిమా క్లాసిక్ బ్లాక్‌బస్టరే అనుకోండి. అయితే ‘ఇండియన్ 2’ సినిమా వచ్చాక మొత్తం పరిస్థితులు మారిపోయాయి. ఆ సినిమా ఫలితం కారణంగా ఏకంగా ‘ఇండియన్’ పాత్ర మీద గౌరవం తగ్గిపోయింది. సినిమా డిజాస్టర్ అవ్వడం, కొన్ని సన్నివేశాల అస్సలు ఆకట్టుకోకపోవడమే దీనికి కారణం. దీంతో షూటింగ్ పూర్తయిపోయిన మూడో ‘భారతీయుడు’ మీద నీలి నీడలు కమ్ముకున్నాయి.
Indian 3
గత కొన్ని నెలలుగా అయితే ఈ సినిమా గురించి ఎక్కడా ఎలాంటి చర్చ లేదు. దీంతో ఆ సినిమా గురించి మరచిపోవడమే బెటర్ అనుకున్నారు ‘ఇండియన్’ ఫ్యాన్స్, కమల్‌హాసన్ అభిమానులు. కానీ వారందరికీ షాక్ ఇస్తూ.. సినిమా ప్రేక్షకులకు ఝలక్ ఇస్తూ ఓ విషయం బయటకు వచ్చింది. అదే ‘ఇండియన్ 3’ పనులు మళ్లీ మొదలుపెడతారు అని. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాను తప్పకుండా రిలీజ్ చేయాలని నిర్మాణ సంస్థ ఫిక్స్ అయిపోయిందట.
ఏ మాటకు ఆ మాట చెప్పాలి.. పూర్తయిపోయిన హై బడ్జెట్ సినిమాను ఏ నిర్మాత కూడా తన దగ్గరే ఉంచేయాలని అనుకోరు. కష్టమో, నష్టమో రిలీజ్ చేసేద్దాం అనే అనుకుంటారు. అలా ‘ఇండియన్ 2’ సినిమా డిజాస్టర్ అయినా.. ‘ఇండియన్ 3’ సినిమాను తీసుకురావాలనే చూస్తున్నారట. దర్శకుడు శంకర్ ఆ దిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారని, త్వరలోనే కొలిక్కి తెచ్చి రిలీజ్ డేట్ నిర్ణయిస్తారని చెబుతున్నారు.
నిజానికి ‘భారతీయుడు’ సినిమా అసలు కథ మూడో పార్టులోనే ఉంది. ఈ భాగంలో సుకన్య స్థానంలో కాజల్ అగర్వాల్ కనిపిస్తుంది. కమల్ మధ్య వయసు యువకుడిగా కనిపించబోతున్నారు. దీంతో ఆ పాత్ర నుండి మరింత సందడి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చెబుతున్నారు. మరి రెండో ‘భారతీయుడు’ కొట్టి దెబ్బ కారణంగా.. మూడో ‘భారతీయుడు’కి మార్కెట్ నడుస్తుందా? సినిమా థియేటర్లకు వస్తుందా అనేది చూడాలి.











