Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

ఓ రెండేళ్ల క్రితం వరకు ‘ఇండియన్‌’ / ‘భారతీయుడు’ అంటే ఓ గొప్ప సినిమా. ఇప్పటికీ ఆ సినిమా క్లాసిక్‌ బ్లాక్‌బస్టరే అనుకోండి. అయితే ‘ఇండియన్‌ 2’ సినిమా వచ్చాక మొత్తం పరిస్థితులు మారిపోయాయి. ఆ సినిమా ఫలితం కారణంగా ఏకంగా ‘ఇండియన్‌’ పాత్ర మీద గౌరవం తగ్గిపోయింది. సినిమా డిజాస్టర్‌ అవ్వడం, కొన్ని సన్నివేశాల అస్సలు ఆకట్టుకోకపోవడమే దీనికి కారణం. దీంతో షూటింగ్‌ పూర్తయిపోయిన మూడో ‘భారతీయుడు’ మీద నీలి నీడలు కమ్ముకున్నాయి.

Indian 3

గత కొన్ని నెలలుగా అయితే ఈ సినిమా గురించి ఎక్కడా ఎలాంటి చర్చ లేదు. దీంతో ఆ సినిమా గురించి మరచిపోవడమే బెటర్‌ అనుకున్నారు ‘ఇండియన్‌’ ఫ్యాన్స్‌, కమల్‌హాసన్‌ అభిమానులు. కానీ వారందరికీ షాక్‌ ఇస్తూ.. సినిమా ప్రేక్షకులకు ఝలక్‌ ఇస్తూ ఓ విషయం బయటకు వచ్చింది. అదే ‘ఇండియన్‌ 3’ పనులు మళ్లీ మొదలుపెడతారు అని. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాను తప్పకుండా రిలీజ్‌ చేయాలని నిర్మాణ సంస్థ ఫిక్స్‌ అయిపోయిందట.

ఏ మాటకు ఆ మాట చెప్పాలి.. పూర్తయిపోయిన హై బడ్జెట్‌ సినిమాను ఏ నిర్మాత కూడా తన దగ్గరే ఉంచేయాలని అనుకోరు. కష్టమో, నష్టమో రిలీజ్‌ చేసేద్దాం అనే అనుకుంటారు. అలా ‘ఇండియన్ 2’ సినిమా డిజాస్టర్‌ అయినా.. ‘ఇండియన్‌ 3’ సినిమాను తీసుకురావాలనే చూస్తున్నారట. దర్శకుడు శంకర్ ఆ దిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారని, త్వరలోనే కొలిక్కి తెచ్చి రిలీజ్ డేట్ నిర్ణయిస్తారని చెబుతున్నారు.

నిజానికి ‘భారతీయుడు’ సినిమా అసలు కథ మూడో పార్టులోనే ఉంది. ఈ భాగంలో సుకన్య స్థానంలో కాజల్ అగర్వాల్ కనిపిస్తుంది. కమల్ మధ్య వయసు యువకుడిగా కనిపించబోతున్నారు. దీంతో ఆ పాత్ర నుండి మరింత సందడి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చెబుతున్నారు. మరి రెండో ‘భారతీయుడు’ కొట్టి దెబ్బ కారణంగా.. మూడో ‘భారతీయుడు’కి మార్కెట్‌ నడుస్తుందా? సినిమా థియేటర్లకు వస్తుందా అనేది చూడాలి.

రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus