ఈ ఏడాది తెలుగు, తమిళ్, కన్నడలో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సినిమాలు ఏవంటే..?

ఒకప్పుడు మన సౌత్ సినిమాలను నార్త్ వాళ్లు చాలా చిన్న చూపు చూసేవారు.. వరల్డ్‌లో హాలీవుడ్ తర్వాత ఇండియాలో బాలీవుడ్ మాత్రమే.. మిగతావన్నీ వేస్ట్ అన్నట్టు ఉండేది వాళ్ల వ్యవహారం.. లేట్ అయినా లేటెస్ట్‌గా అన్నట్టు.. ఇప్పటికి సౌత్ సినిమాలు నార్త్‌లో జెండా ఎగరేశాయి.. వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతూ అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించాయి. గతకొంత కాలంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న మన చిత్రాలు, వాటికి దక్కుతున్న ఆదరణ చూసి బాలీవుడ్ బాబులు షాక్‌తో పాటు సర్‌ప్రైజ్‌కి గురవుతున్నారు..

‘బాహుబలి : ది బిగినింగ్’, ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’, ‘కె.జి.యఫ్ – ఛాప్టర్ : 1’, ‘పుష్ప – ది రూల్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కె.జి.యఫ్ – ఛాప్టర్ : 2’, ‘కాంతార’ హిందీ బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లు రాబట్టాయి.. ఇక ట్రిపులార్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉంది.. కోలీవుడ్, శాండల్ వుడ్ ఇండస్ట్రీలు కూడా ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్ అకౌంట్స్ ఓపెన్ చేశాయి.. సౌత్‌లో 2022లో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన పరిశ్రమలు.. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..

కోలీవుడ్..

1. పొన్నియన్ సెల్వన్ – వరల్డ్ వైడ్ షేర్ : రూ. 495.50 కోట్లు..

2. విక్రమ్ – వరల్డ్ వైడ్ షేర్ : రూ. 430.00 కోట్లు..

టాలీవుడ్..

1. ఆర్ఆర్ఆర్ – వరల్డ్ వైడ్ షేర్ : రూ. 1111.10 కోట్లు.. (జాపాన్ క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది)..

శాండల్ వుడ్..

1. కె.జి.యఫ్ – ఛాప్టర్ : 2 – వరల్డ్ వైడ్ షేర్ : రూ. 1187.70 కోట్లు..

2. కాంతార – వరల్డ్ వైడ్ షేర్ : రూ. 406.75 కోట్లు..

మలయాళంలోనూ ఘనవిజయం సాధించిన సినిమాలు.. కలెక్షన్ల పరంగా గ్రోత్ అయిన సినిమాలూ వచ్చాయి.. ఒక ఎటు తిరిగి.. ఇండియన్ బాక్సాఫీస్‌కి ‘బాహుబలి’ అనుకున్న బాలీవుడ్‌ది మాత్రం రక్తకన్నీరే.. బిగ్ స్టార్స్, భారీ బడ్జెట్.. ఇవేమీ హిందీ పరిశ్రమ పరువుని కాపాడలేకపోయాయి సరి కదా.. కమెడియన్ల సినిమల కంటే దారుణమైన వసూళ్లు రాబట్టి షాక్ ఇచ్చాయి..

అజయ్ దేవ్‌గన్ మాత్రం ‘దృశ్యం 2’ తో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. ఏడాది చివర్లో టియర్స్ తుడుచుకోవడానికి టిష్యూ ఇచ్చినట్టైంది.. ఆల్ రెడీ అందరూ చూసేసిన సీక్వెల్‌ని (ఫస్ట్ పార్ట్ కూడా తనే రీమేక్ చేయడంతో నార్త్ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు) ఇలాంటి పరిస్థితిలో రీమేక్ చేసి భారీ సక్సెస్ సాధించడం విశేషమనే చెప్పాలి.. బాలీవుడ్ ఇస్తున్న మూస కంటెంట్ కంటే.. మన సౌత్ వాళ్ల అందిస్తున్న ఫ్రెష్ కంటెంట్‌, కొత్తదనానికే నార్త్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus