Allu Arjun, Vijay Deverakonda: నేను ముందు అంటే నేను ముందు అంటున్నారు!

టాలీవుడ్‌లో ఫ్రెండ్లీ వార్‌ అంటే… సినిమాలు విడుదలైనప్పుడే కనిపించేది. ఒకేసారి ఇద్దరు హీరోల సినిమాలు వస్తే ‘ఏ సినిమా హిట్‌ అవుతుంది’ అంటూ అభిమానులు, ఆ హీరోలు ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఇద్దరి సినిమాలు హిట్‌ అయితే ఓకే… ఏ ఒక్కరిది పోయినా… ఇక నోళ్లకు పని చెప్పేవారు. ఒక్కోసారి ఈ ఫ్రెండ్లీ వార్‌ కాస్త నిజమైన వార్‌గా మారిపోయింది. అయితే సోషల్‌ మీడియా టైమ్‌లో ఫాలోవర్ల సంఖ్య విషయంలో ఇలాంటి వార్‌ కనిపిస్తోంది. అయితే ఇది ఓ ఇద్దరు యువ హీరోల మధ్యనే.

గత కొద్ది రోజులుగా తెలుగు హీరోల సోషల్‌ మీడియా పేజీల వార్తలు చూస్తే ఈ విషయం మీకే అర్థమైపోతుంది. ఇంకా క్లియర్‌గా తెలియాలంటే నిన్న అల్లు అర్జున్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చూడాలి. ఇన్‌స్టాలో తన ఫాలోవర్ల సంఖ్య 1.3 కోట్లు (13 మిలియన్లు) దాటింది అంటూ బన్నీ ఘనంగా చెప్పుకొచ్చాడు. తర్వాతి టర్న్‌ విజయ్‌ దేవరకొండది. ఈ వార్త రాసేసమయానికి అల్లు అర్జున్‌కు 1,30,12,871 మంది, విజయ్‌కి 1,29,78,835 మంది ఉన్నారు.

ఒకటి, రెండు రోజుల్లో విజయ్‌ ఫాలోవర్ల సంఖ్య కూడా 13 మిలియన్లు కాబోతోంది. అప్పుడు మరో పోస్టర్‌ వస్తుంది. అక్కడికి కొద్ది రోజులకు 1.4 కోట్లు పోస్టర్‌… ఇలా ఈ పోస్టర్లు, వార్తలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే దక్షిణాదిలో తొలి స్థానం అనేది ఇక్కడ పాయింట్‌. అయితే ఎన్నాళ్లు ఇలా ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య వార్‌ నడుస్తుంది. ఎక్కడో దగ్గర ఆగితే… ఫ్యాన్‌ వార్‌ లాంటివి జరగకుండా ఉంటాయి. ‘మేమే ఫస్ట్‌’ అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టేదే కదా.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus