సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక అంగరంగా వైభవంగా జరిగింది. యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పవన్ సర్దార్ పాటలు మార్కెట్లోకి విడుదల అయ్యాయి అనడం కన్నా, విడుదలయిన కొన్ని గంటల్లోనే ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. అయితే అంతటి ప్రభంజనం అని తెలిసి కూడా, కేవలం 100ల్లో పాస్ లు ఇవ్వడం ఏంటి? అంతేకాకుండా పవన్ అభిమానులను ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎందుకు రావద్దు అన్నాడు??…దానికి గల కారణాలు బయటకు వచ్చాయి. సినీ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం…పవన్ కళ్యాణ్ కి ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు అందాయి, కీలకమైన గొడవలు జరపడం కోసం కొందరు అరాచక శక్తులు ఈ వేడుకని టార్గెట్ చేశారు అనే విషయం పవన్ కి తెలిసింది అనీ అందుకే కళ్యాణ్ అసలు ఏ వేడుకను వద్దు అని అన్నాడు. కానీ శరత్ మరార్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి ఇప్పుడు ప్రమోషన్ లో అత్యంత ఇంపార్టెంట్ అయిన ఆడియో ని పక్కన పెడితే సినిమాకు ఇబ్బందులు కలుగుతాయి అని, అందుకే అటు శరత్ ని నొప్పించకుండా , ఫాన్స్ ని ఇబ్బంది పెట్టకుండా కళ్యాణ్ ఇలా ప్లాన్ చేశాడు అని తెలుస్తుంది.
అంతే కాకుండా ఈ ఇంటలిజెన్స్ రిపోర్ట్ తరవాత హోటల్ నోవోటేల్ వారు కూడా పవన్ ఆడియో కి అనుమతి ఇవ్వలేదు అనీ కళ్యాణ్ చాలా పెద్ద పెద్ద వ్యక్తులని పట్టుకొచ్చి మరీ సిఫార్సు చేయించాల్సి ఒచ్చింది అనేది టాక్. బహుశా అందుకేనేమో పవన్ తాను ముందు ఈ వేడుకను క్యాన్సల్ చెయ్యాలి అనుకుని ఫాన్స్ కోసం , నిర్మాత కోసం ఓకే చెప్పాడు. అంతేకాకుండా ప్రెస్ మీట్ లో తెలంగాణా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఏది ఏమైనా…పవన్ ఫ్యాన్స్ కోసం ఏమనా చేస్తాడు అని మరోసారి నిరూపితం అయ్యింది.