Pushpa2 OTT: వామ్మో.. పుష్ప2 ఓటీటీ హక్కులకు ఇంత డిమాండా?

2021 సంవత్సరంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలను అందించిన సినిమా ఏదనే ప్రశ్నకు పుష్ప ది రైజ్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. విడుదలైన మూడు వారాలకే పుష్ప ది రైజ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయినా థియేటర్ల ద్వారా ఈ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా థియేటర్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించిన సినిమాగా పుష్ప ది రైజ్ నిలిచింది.

పుష్ప ది రైజ్ సంచలన విజయంతో పుష్ప ది రూల్ కు విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. పుష్ప ది రైజ్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేయగా పుష్ప ది రూల్ డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడానికి నెట్ ఫ్లిక్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు బోగట్టా. సాధారణంగా పార్ట్1 ఒక ఓటీటీలో పార్ట్2 మరో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం జరగదు. అయితే పుష్ప విషయంలో అలా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

అల్లు అర్జున్, సుకుమార్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకోనున్నారని తెలుస్తోంది. పుష్ప ది రూల్ హిందీ హక్కుల ద్వారా నిర్మాతలకు 200 కోట్ల రూపాయల నుంచి 250 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పుష్ప ది రూల్ ఏపీ, తెలంగాణ హక్కులకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది. పుష్ప ది రూల్ ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.

బన్నీ సైతం ఈ సినిమా ఫలితం విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. బన్నీ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప ది రూల్ పూర్తయ్యే వరకు బన్నీ మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పే అవకాశం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బన్నీ కొత్త ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus