చిత్రపరిశ్రమలో బడ్జెట్, రెమ్యూనరేషన్ అనేవి పుకార్లకు మాత్రమే పరిమితం అవుతాయి. బడ్జెట్ ఎంత అనేది చిత్రబృందం అధికారికంగా చెప్పదు. సినిమాకు ఎంత తీసుకున్నారో హీరో చెప్పడు. ఇవన్నీ ఆ నోట, ఈ నోట చేరి మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. వీటిలో చాలావరకు పర్‌ఫెక్ట్‌గానే ఉంటాయి. అలా బయటికి వచ్చిన ఓ సినిమాకు హీరో అందుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘వకీల్‌సాబ్’ కోసం పవన్ నిమిషానికి కోటి రూపాయలు అందుకున్నాడనేది టాక్ మరి.
‘వకీల్‌సాబ్’ సినిమాలో పవన్ స్క్రీన్ టైమ్ 50 నుండి 55 నిమిషాలు ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఈ సినిమా కోసం పవన్ ₹50 కోట్లు తీసుకున్నాడని కూడా వార్తలొస్తున్నాయి. ఈ రెండింటి విషయంలో చిత్రబృందం నుండి ఎలాంటి స్పందనా లేదు. కాబట్టి ఈ రెండూ కలిపి చూస్తే… సినిమా కోసం పవన్ నిమిషానికి కోటి రూపాయలు తీసుకున్నాడని అనుకోవచ్చు. మరి నిర్మాతలు ఎంతిచ్చారు, ఈయనెంత తీసుకున్నారు. అసలు ఎంత సేపు పవన్ సినిమాలో కనిపిస్తాడు అనేది 9న తెలుస్తుంది.
‘వకీల్‌సాబ్’ బిజినెస్ విషయంలో దిల్ రాజు ఫుల్ ప్లానింగ్‌తో ఉన్నాడని టాక్. ఇప్పటికే సినిమాకు సంబంధించి ₹90 కోట్ల బిజినెస్ చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా పవన్‌కు అంతిచ్చారా, సినిమా అంత బిజినెస్ అయ్యిందా అనేది తెలియాలి. ఏదేమైనా మూడేళ్ల తర్వాత పవన్ నుండి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రచార చిత్రాలకు వచ్చిన క్రేజ్ కొనసాగితే సినిమాకు భారీ వసూళ్లు ఖాయం. అయితే కరోనా పరిస్థితులు ఏం చేస్తాయో చూడాలి.