బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్ నిలిచాడు. సీజన్ ప్రారంభమైన తొలి వారం నుండి టైటిల్ కొట్టే ఛాన్స్ నిఖిల్‌కే ఉందని వచ్చిన కామెంట్లు, అంచనాలను నిజం చేస్తూ ఆదివారం రాత్రి ఆయనను విజేతగా నాగార్జున (Nagarjuna) అనౌన్స్ చేశారు. రెండో కంటెస్టెంట్‌గా ఇంటిలోకి అడుగు పెట్టిన నిఖిల్ 105 రోజుల పాటు హౌస్‌లో ఉండి.. మరీ విజేతగా నిలిచాడు. అతని గురించి చూస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.
అందికీ తెలిసినట్లే కర్ణాటకలోని మైసూరులో జన్మించిన నిఖిల్ మాలియక్కల్‌కు (Nikhil) నటన కొత్తేమీ కాదు. ఎందుకంటే తన తల్లి సులేఖ కన్నడ నటిగా అక్కడివారికి సుపరిచుతులు. చిన్నతనం నుండి ఇంట్లో సినిమాల గురించి చర్చ ఉండటంతో నిఖిల్ కూడా వినోద ప్రపంచంలో అడుగు పెట్టాలనుకున్నాడు. చదువుకునే రోజులలో సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. డ్యాన్స్ పోటీల్లో చిందేస్తే కప్పు గ్యారెంటీ అనేలా డ్యాన్స్ వేసేవాడు.
చదువు అయ్యాక ఓ ప్రైవేటు కంపెనీలో కొన్నాళ్లు పనిచేసిన నిఖిల్ ఉద్యోగం, నటన అనే త్రాసులో నటనవైపు మొగ్గారు. ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా సినిమాల్లో అవకాశాలవైపు వచ్చేశాడు. అలా అని హీరో అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ డ్యాన్స్‌పై పట్టు ఉండటంతో ఇండస్ట్రీలో డ్యాన్సర్ అవుదామని తొలుత అనుకున్నారు. కొన్ని ఈవెంట్లు కూడా చేశాడు. కొద్ది రోజులకు విలన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. దాంతో ఓ ట్రైల్ వేద్దామని అని నిర్ణయించుకున్నాడు.
కానీ ‘ఊటీ’ అనే సినిమాతో శాండిల్‌వుడ్‌ఓ సహాయ నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ‘మానై మంత్రాలయ’తో కన్నడ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత తెలుగులోకి వచ్చి ‘గోరింటాకు’, ‘అమ్మకు తెలియని కోయిలమ్మ’ లాంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొలినాళ్లలో ఇంటి పెద్దగా అందరినీ బాగా హ్యాండిల్ చేశాడు. ఆ తర్వాత కాస్త ట్రాక్ తప్పినా.. తిరిగి తేరుకొని ఆడి విజేతగా నిలిచాడు.