Samantha: సమంత సినిమాలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘యశోద’. ఈ సినిమాను నవంబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కథ సైన్స్, సూపర్ నేచురల్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంటరెస్టింగ్ విషయం బయటకొచ్చింది. ఈ సినిమా కథలో ముకుందన్ అనే వ్యక్తి ఒక మందు కనిపెడతాడట.

అది మనిషి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే.. చాలా తక్కువ వయసు ఉన్నట్లుగా కనపడడమే కాకుండా.. మనిషి ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. సినిమా మొత్తం ఈ పాయింట్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ కాన్సెప్ట్ ను ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వచ్చింది. అందులో సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. హరి, హరీష్ అనే ఇద్దరు కొత్త దర్శకులు ఈ సినిమాను రూపొందించారు.

ఇందులో సమంత గర్భవతి పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో భారీ యాక్షన్స్ సీక్వెన్సెస్ ఉంటాయని తెలుస్తోంది. అందులో ఒకటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటుందని. క్లైమాక్స్ కి ముందు వచ్చే యాక్షన్ సీన్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందట. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడింది. ఇందులో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావురమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ ఇలా చాలా మంది నటులు కీలకపాత్రలు పోషించారు.

మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అదే రేంజ్ లో బిజినెస్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. రూ.8 కోట్ల టేబుల్ ప్రాఫిట్ కి సినిమాను అమ్మినట్లు సమాచారం.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus