Mrunal Thakur: ‘సీతారామం’ హీరోయిన్‌ గురించి ఆసక్తికర విషయం!

‘సీతా రామం’ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ నటనకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సీతా మహాలక్ష్మిగా ఆమె నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు. అయితే నిజానికి ఈ సినిమా కోసం ఆమె మరో పెద్ద సినిమాను వదులుకుందని మీకు తెలుసా? అది కూడా అలాంటిలాంటి సినిమా కాదు. ప్రభాస్‌ లాంటి అగ్ర హీరో సరసన నటించే అవకాశం. అవును, ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు. ఆ సినిమా నిర్మాత అశ్వనీదత్. అయితే ఆ సినిమా అవకాశం కోల్పోయినా.. ఈ సినిమాతో మంచి పేరే తెచ్చుకుంది అనుకోండి.

ప్రభా్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వైజయంతీ మూవీస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా దీపిక పడుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత ఈ పాత్ర కోసం మృణాల్‌ ఠాకూర్‌ను అనుకున్నారట. ఆమెను సినిమా కోసం అంతా ఓకే చేసుకున్నాక.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ వద్దకు ‘సీతా రామం’ స్క్రిప్ట్‌ వచ్చిందట. ఆ కథ గురించి తెలుసుకున్నాక.. ఆ కథలో సీతా మహాలక్ష్మి పాత్రకు మృణాల్‌ అయితే బాగుంటుందని అనుకున్నారట. అలా ‘సీతారామం’ సినిమాలోకి మృణాల్‌ ఠాకూర్‌ వచ్చిందని నిర్మాత అశ్వనీద్‌ తెలిపారు.

అలా ‘సీతా రామం’లో వచ్చిన అవకాశాన్ని మృణాల్‌ ఠాకూర్‌ ఒడిసిపట్టుకుంది అని చెప్పాలి. సీతా మహాలక్ష్మి పాత్రలో ఆమె నటన, ఆహార్యం, అందం అదిరిపోయాయి. ఒకవేళ ప్రభాస్‌ సరసన చేసి ఉంటే.. ఇంత పేరు వచ్చి ఉండేదా? అంటే చెప్పలేం. కానీ ఇప్పుడు సీత పాత్రతో ఆమెకు వచ్చిన పేరుతో వరుస అవకాశాలు అందుకుంటోంది అని చెప్పొచ్చు. ఇప్పుడు కుర్ర స్టార్‌ హీరోలు తమ కొత్త సినిమాల్లో ఈ భామను ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారు.

అయితే ఈ క్రమంలో మృణాల్‌ రెమ్యూనరేషన్‌, ఇతర ఖర్చులు కాస్త ఘాటెక్కాయని చెబుతున్నారు. అయితే గ్లామర్‌ పరంగా, నటన పరంగా బాగుండటంతో నిర్మాతలు వెనకడుగు వేయలేకపోతున్నారనే మాటలూ వినిపిస్తున్నాయి. అయితే ఆమె నుండి కొత్త తెలుగు సినిమా ఇంకా అనౌన్స్‌ కాలేదు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus