Sreeleela: శ్రీలీల డ్యాన్స్‌ వెనుక కష్టం ఇప్పటిది కాదట.. ఆ వయసులోనే..?

టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీలీల అనే చెప్పాలి. కాస్త పేరున్న కొత్త సినిమా ఏదైనా సెట్స్‌ మీదకు వెళ్తోంది అంటే అందులో హీరోయిన్‌గా శ్రీలీల పేరు ఉంటోంది. లేదంటే ఆ సినిమా కాస్టింగ్‌ సెలక్షన్‌ టైమ్‌లో అయినా చర్చకు వచ్చి ఉంటుంది. అంతలా ఆమె టాలీవుడ్‌లో భాగమైపోయింది శ్రీలీల. అంతలా ఆమె ఎందుకు నచ్చేసింది మన కుర్రాళ్లకు అంటే.. అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌ కూడా అని చెప్పాలి.

తొలి తెలుగు సినిమా ‘పెళ్లి సందD’ నుండే ఆమె డ్యాన్స్‌ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసిపోయింది. ఆ సినిమాలో రోషన్‌ పక్కన ఆమె డ్యాన్స్‌ వేస్తుంటే రెండు కళ్లూ చాలలేదు. ఆ తర్వాత ఆమె చేసిన ‘ధమాకా’లో అయితే రవితేజతో కలసి డ్యాన్స్‌ అదరగొట్టేసింది. అంతలా ఆమె డ్యాన్స్‌ బాగుండటానికి కారణం ఏంటంటే.. ఆమె మూడో ఏట నుండే డ్యాన్స్‌ నేర్చుకోవడమేనట. ఈ విషయాన్ని ఆమెనే ఇటీవల చెప్పుకొచ్చింది. చిన్నతనంలో డ్యాన్స్‌ తన జీవితంలోకి ఎలా వచ్చింది అనేది కూడా చెప్పింది.

తన మూడో ఏట నుండే శ్రీలీల (Sreeleela) మాతృమూర్తి డ్యాన్స్‌ క్లాస్‌కు పంపించేవారట. డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసి చేసి కాళ్లు బొబ్బలు కట్టేసేవని శ్రీలీల చెప్పుకొచ్చింది. అంతలా ఇబ్బందిపడినా తన తల్లి మాత్రం డ్యాన్స్‌ కొనసాగించమని చెప్పిందని తెలిపింది. ఆ రోజుల్లో ‘డ్యాన్స్‌ వద్దు స్కూల్‌కి వెళ్లిపోతాను అమ్మా’ అనాలని అనిపించేదని కానీ.. ఆమె మాట ప్రకారం డ్యాన్స్‌ నేర్చుకున్నానని.. అది ఇప్పుడు తనకు సినిమాల్లో బాగా ఉపయోగపడుతోందని చెప్పుకొచ్చింది.

ఇక ఆమె సినిమాల సంగతి చూస్తే… ప్రస్తుతం చేతిలో సుమారు పది సినిమాలు ఉన్నాయని టాక్‌. వైష్ణవ్‌తేజ్‌తో ‘ఆదికేశవ’ చేస్తుండగా… రామ్‌ – బోయపాటి సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌. నితిన్‌, విజయ్‌ దేవరకొండ, నవీన్‌ పొలిశెట్టి సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా, పవన్‌ కల్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’, బాలకృష్ణ – అనిల్‌ రావిపూడి సినిమాలో ఆమెనే నటిస్తోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus