కల్ట్, క్లాసిక్.. ఇలాంటి పదాలు కొన్ని సినిమాలకు మాత్రమే బాగుంటాయి. బాగా నప్పుతాయి కూడా. అలాంటి కొన్ని సినిమాల్లో తప్పక ఉండాల్సిన చిత్రం ‘సఖి’ (Sakhi). ఇండియన్ సినిమాలో అలాంటి ఓ ప్రేమకథను అప్పటివరకు చూడని సినిమా ప్రేక్షకులు తెగ మెచ్చేసుకున్నారు. మణిరత్నం (Mani Ratnam) బెస్ట్ మూవీస్ లిస్ట్‌లో కచ్చితంగా ఉండే ఈ సినిమాకు నేటితో 25 ఏళ్లు. ఈ నేపథ్యంలో సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూసేద్దాం.
* ‘సఖి’ సినిమా ఆలోచన ఆయనకు రావడానికి కారణం ఓ ప్రేమ జంట బైక్‌పై వెళ్తుండగా ఆయన చూడటమే. ప్రేమలో ఉన్నప్పుడు అంతా ఓకే. కానీ ఆ ప్రేమ పెళ్లిగా మారాక పరిస్థితి ఏంటి అనేదే సినిమా చేద్దాం అనుకుని ప్రముఖ రచయిత సుజాత (రంగరాజన్)కు చెప్పి ఈ కథ ఆలోచన చేశారు.
* తొలుత ఈ సినిమాను షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా చేయాలని అనుకున్నారు. హీరోయిన్‌గా వసుంధరా దాస్‌ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ వివిధ చర్చల తర్వాత ఆ పాత్రల్లోకి మాధవన్, షాలిని వచ్చారు.
* ఇక్కడో విషయం ఏంటంటే.. ‘ఇద్దరు’ (Iruvar) సినిమాలో ఓ పాత్ర కోసం మాధవన్‌ను (R.Madhavan) స్క్రీన్ టెస్ట్ చేసి రిజెక్ట్ చేశారట మణిరత్నం (Shalini Ajith). అక్కడ తిరస్కరణకు గురై ఇక్కడకు వచ్చారన్నమాట.
* ఇక షాలిని అక్క పాత్రకు పెళ్లి చూపులు చూడటానికి వచ్చే పాత్ర కోసం విక్రమ్‌ను (Vikram) అడిగారట ఆయన నో చెప్పారట. అలాగే అరవింద్ స్వామి (Arvind Swamy) పాత్రకు ముందు మమ్ముట్టి, మోహన్‌లాల్ (Mohanlal) లాంటి వాళ్లను అనుకున్నారట.
* ఇంత చెప్పీ సినిమాలోని పాటల గుచించి చెప్పకపోతే బాగోదు. ఇప్పటికీ మంచి ప్రేమ పాట వినాలన్నా, ఉత్తమ టేకింగ్ చూడాలన్నా ఈ సినిమాలోని పాటలే చూడాలి. ‘పచ్చందనమే’, ‘స్నేహితుడా’ మీకు గుర్తుండే ఉంటాయి.
* ఆఖరిగా.. ‘సఖి’ సినిమాకు ముందుకు వరు దర్శకుడు మణిరత్నానికి సరైన విజయాలు లేవు. ‘ఇద్దరు’, ‘దిల్ సే’ (Dilse) అంటూ వచ్చి ఇబ్బందుల్లో పడ్డారు. అంతటి ఒత్తిడిలో వచ్చిన ఆ సినిమా ఊహించని విజయం అందుకుంది.