Chiranjeevi: 30 ఏళ్ల క్రితమే మెగాస్టార్ మూవీ గురించి అలా రాశారా?

  • March 10, 2022 / 06:05 PM IST

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో స్టేట్ రౌడీ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. రాధ, భానుప్రియ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా బప్పి లహరి ఈ సినిమాకు సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమా రిలీజైన సమయంలో మొదట ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ టాక్ వచ్చింది.

Click Here To Watch Now

ఈ సినిమాకు మొదట కోదండ రామిరెడ్డి దర్శకుడిగా ఎంపికైనా కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కు డైరెక్షన్ చేసే ఛాన్స్ బి.గోపాల్ కు దక్కింది. సుబ్బరామిరెడ్డి చిరంజీవితో నిర్మించిన ఏకైక మూవీ స్టేట్ రౌడీ కావడం గమనార్హం. 1989 సంవత్సరం మార్చి నెల 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. నైజాం బయ్యర్లు బ్లాంక్ చెక్కులు ఇచ్చి ఈ సినిమా హక్కులు కొనుగోలు చేయాలని అప్పట్లో ప్రయత్నాలు చేశారు.

సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా తొలిరోజు నుంచే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా నైజాంలో కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా రిలీజయ్యే సమయానికి అమితాబ్ బచ్చన్ ఆలిండియా సూపర్ స్టార్ గా ఉన్నారు. అయితే ఆయన సినిమాలను మించి చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఆ సమయంలో ట్రేడ్ గైడ్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ చిరంజీవి నటించిన సినిమా కలెక్షన్ల వివరాలను ప్రచురించి వేరీజ్ అమితాబ్? అని ప్రశ్నిస్తూ ఆర్టికల్ రాసింది.

వైరల్ అయిన ఆ ఆర్టికల్ ను చదివి హిందీ సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయారని సమాచారం. కమల్, రజినీకాంత్ ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ కు హాజరు కాగా ఈ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus