అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా పుష్ప ది రూల్ (Pushpa2) మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. అన్ని భాషలకు ఒకే టీజర్ రిలీజ్ కాగా యూట్యూబ్ లో ఈ టీజర్ వ్యూస్ పరంగా అదరగొడుతోంది. టీజర్ రిలీజైన గంటలోనే ఏకంగా 2.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అమ్మవారి గెటప్ లో బన్నీ లుక్ వేరే లెవెల్ లో అల్లు అర్జున్ మాస్ జాతర మామూలుగా లేదని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
గంగోత్రి (Gangotri) సినిమా నుంచి పుష్ప ది రైజ్ (Pushpa) సినిమా సినిమాకు లుక్ విషయంలో, డైలాగ్ డెలివరీ విషయంలో బన్నీ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న బన్నీ భాష ఏదైనా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. మలయాళ సినీ అభిమానులు బన్నీని ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. “ఆడా ఉంటా.. ఈడా ఉంటా” అని సినిమాల్లో డైలాగ్ చెప్పే బన్నీ రియల్ లైఫ్ లో కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
గంగోత్రి సినిమా సమయంలో లుక్స్ విషయంలో వచ్చిన ట్రోల్స్ కు ఆర్యతో బన్నీ సమాధానమిచ్చారు. ఆర్య2 (Arya 2), వరుడు(Varudu) , వేదం (Vedam), బద్రీనాథ్ (Badrinath) ఇలా వరుస సినిమాలు నిరాశపరిచిన సమయంలో జులాయి (Julayi) సినిమాతో బన్నీ భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ డ్యాన్సర్లలో బన్నీ ఒకరని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. హీరోగా గంగోత్రి, ఆర్య(Aarya) , బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న అల్లు అర్జున్ తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరో కావడం గమనార్హం.
పారితోషికం తీసుకోకుండానే రుద్రమదేవి (Rudramadevi) సినిమాలో నటించి గుణశేఖర్ కు (Gunasekhar) బన్నీ తన వంతు సహాయసహకారాలు అందించారు. బన్నీ ప్రతి సినిమాలో సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి. ప్రయోగాత్మక సినిమాలు ఫెయిలైనా దర్శకుడిని బన్నీ ఎప్పుడూ నిందించలేదు. బన్నీ ప్రతిభకు జాతీయ అవార్డ్ తో పాటు ఎన్నో అవార్డులు వచ్చాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో సైతం బన్నీ టాప్ లో ఉన్నారు. బన్నీ మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవడంతో పాటు తన సినిమాలతో పాన్ వరల్డ్ స్థాయిలో చరిత్ర సృష్టించి మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఆశిద్దాం.