Jai Lava Kusa: జై లవకుశ స్పెషల్ షో వెనుక అసలు కారణమిదే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన జై లవకుశ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ మూడు పాత్రలలో నటించగా లవ, కుశ పాత్రలతో పోల్చి చూస్తే జై పాత్ర అభిమానులకు ఎక్కువగా నచ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కగా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కడంతో కళ్యాణ్ రామ్ కు భారీగా లాభాలు వచ్చాయి.

అప్పట్లో ఈ సినిమా 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే సెప్టెంబర్ 2వ తేదీన హరికృష్ణ పుట్టినరోజు కావడంతో జై లవకుశ స్పెషల్ షో ప్రదర్శితమైంది. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్ లో జై లవకుశ సినిమా ప్రదర్శితమైంది. పెద్దగా ప్రచారం చేయకుండానే ఎన్టీఆర్ అభిమానులు జై లవకుశ సినిమాను థియేటర్ లో చూడటం గమనార్హం. రాశిఖన్నా, నివేదా థామస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా నందితా రాజ్ ఈ సినిమాలో చిన్న పాత్రలో మెరిశారు.

జై లవకుశ సినిమాకు తారక్ పారితోషికం తీసుకోకుండా నటించి సినిమా సక్సెస్ సాధించిన తర్వాత లాభాల్లో వాటా తీసుకున్నారని బోగట్టా. సెప్టెంబర్ 21వ తేదీకి ఈ సినిమా విడుదలై ఐదేళ్లు కావడంతో కూడా జై లవకుశ ప్రీమియర్ ను ప్రదర్శించారని సమాచారం అందుతోంది. తారక్ పుట్టినరోజుకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో తారక్ అభిమానులు జై లవకుశ ప్రీమియర్ పై ఆసక్తి కనబరిచారు.

వచ్చే ఏడాది తారక్ పుట్టినరోజున సింహాద్రి లేదా యమదొంగ 4కే వెర్షన్ థియేటర్లలో ప్రదర్శితమయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. మరోవైపు తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలు నటుడిగా తారక్ స్థాయిని మరింత పెంచుతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus