దోసె కింగ్ పై యుద్ధం.. జీవజ్యోతి కథలో ఎన్ని ట్విస్టులో?

  • July 27, 2022 / 11:24 AM IST

గతేడాది థియేటర్లలో విడుదలైన జై భీమ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. సూర్య హీరోగా నటించి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కాయి. దర్శకుడు జ్ఞానవేల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారనే సంగతి తెలిసిందే. ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో జీవజ్యోతి శాంతకుమార్‌ పోరాటగాథ తెరకెక్కనుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు జీవజ్యోతి గురించి పెద్దగా తెలియకపోయినా తమిళనాడు రాష్ట్ర ప్రజలకు మాత్రం జీవజ్యోతి సుపరిచితమైన వ్యక్తి కావడం గమనార్హం.

దోసె కింగ్ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. జీవజ్యోతి వేల సంఖ్యలో ఉద్యోగులకు దేవుడైన శరవణ భవన్‌ రాజగోపాల్ వల్ల తనకు అన్యాయం జరిగిందని చెప్పిన మహిళ కావడం గమనార్హం. శరవణ భవన్ లో పని చేసే అసిస్టెంట్ మేనేజర్ కూతురు జీవజ్యోతి కాగా 1996 సంవత్సరంలో ఆమెకు రాజగోపాల్ తో పరిచయం ఏర్పడింది. చెన్నైలో దోసె కింగ్ గా రాజగోపాల్ కు పేరు ఉండగా జీవజ్యోతి పరిచయమయ్యే సమయానికి రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన ఆమె పరిచయం

అయిన తర్వాత జ్యోతిష్కుని సూచనల మేరకు ఆమెను మూడో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే జీవజ్యోతి అప్పటికే శాంతకుమార్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. ఆ తర్వాత రోజుల్లో రాజగోపాల్ శాంతకుమార్ ను తన మనుషులతో చంపించాడు. ఆ తర్వాత జీవజ్యోతి న్యాయం కోసం పోరాటం చేసి రాజగోపాల్ కు శిక్ష పడేలా చేసింది.

2019 సంవత్సరం జులై 18వ తేదీన రాజగోపాల్ మరణించాడు. జీవజ్యోతి నుంచి బయోపిక్ కు సంబంధించిన హక్కులను కొనుగోలు చేసి జంగిల్‌ పిక్చర్స్‌ వాళ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జై భీమ్ సినిమాలా జీవజ్యోతి బయోపిక్ గా తెరకెక్కిన దోసె కింగ్ కూడా హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus