KGF: కేజీఎఫ్3 మూవీ అలా ఉండబోతుందా?

స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 ప్రమోషన్లలో ఎక్కడా కేజీఎఫ్3 గురించి కామెంట్ చేయలేదు. సినిమాలో హీరో పాత్ర చనిపోవడంతో ప్రేక్షకులు సైతం కేజీఎఫ్3 ఉంటుందని ఊహించలేదు. అయితే ఎవరి అంచనాలకు అందని విధంగా కేజీఎఫ్2 ఎండింగ్ లో ప్రశాంత్ నీల్ సీక్వెల్ గురించి హింట్ ఇచ్చారనే సంగతి తెలిసిందే. అయితే కేజీఎఫ్2 సినిమాలో హీరో పాత్ర చనిపోవడంతో కేజీఎఫ్3 ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. రాకీ భార్య పాత్ర కూడా చనిపోవడంతో ప్రశాంత్ నీల్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

Click Here To Watch NOW

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం విదేశాలలో కేజీఎఫ్3 షూటింగ్ జరగనుంది. రాకీభాయ్ కేజీఎఫ్ లోకి రాకముందు విదేశాల్లో చేసిన నేరాలు ఆ నేరాలు చేయడానికి గల కారణాలతో కేజీఎఫ్3 తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలను పూర్తి చేసి ఈ సినిమాపై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టనున్నారు. పవర్ ఫుల్ మాస్ మసాలా కథలతో ప్రశాంత్ నీల్ ప్రభాస్, ఎన్టీఆర్ లతో సినిమాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

తనే రచయిత తనే దర్శకుడు కావడంతో ప్రశాంత్ నీల్ తన ఊహలకు అనుగుణంగా సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను అందుకుంటున్నారు. కేజీఎఫ్2 సక్సెస్ తో ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ కూడా అంచనాలకు అందని స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది. కేజీఎఫ్2 సినిమాకు తొలిరోజే 135 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్2 సినిమా అంచనాలను మించి భారీస్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. యశ్, ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాలతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉండటం గమనార్హం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus