Krishna Mukunda Murari: కృష్ణా ముకుంద మురారి వెనుక కథ ఇదేనా?

బాలయ్య హోస్ట్ గా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో చివరి ఎపిసోడ్ నిన్నటినుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ లో వంశీ పైడిపల్లి మహర్షి కంటే ముందు మహేష్ బాబుకు కృష్ణా ముకుందా మురారి అనే కథను చెప్పానని వెల్లడించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. అయితే వంశీ పైడిపల్లి మహేష్ కు చెప్పిన కథ బృందావనం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Click Here To Watch

ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2010 సంవత్సరం అక్టోబర్ లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించి నిర్మాతగా దిల్ రాజుకు చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం. అప్పటివరకు ఎక్కువగా మాస్ సినిమాలలో నటించిన ఎన్టీఆర్ ఈ సినిమాలో మాత్రం క్లాస్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఫుల్ రన్ లో 32 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.

కాజల్, సమంత ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. మహేష్ బృందావనం కథలో నటించి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సమ్మర్ కానుకగా మే 11వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. సర్కారు వారి పాట సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించని స్థాయిలో జరిగింది.

త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు మహేష్ బాబుకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus