సాధారణంగా ఏదైనా సినిమాకు ఒకరు లేదా ఇద్దరు నిర్మాతలు ఉంటారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా తెరకెక్కిన సినిమా అయినా ఆ సినిమాకు 1000 మంది కంటే ఎక్కువమంది నిర్మాతలుగా ఉండటం జరగదు. అయితే ఒక సినిమాను ఏకంగా 5 లక్షల మంది నిర్మించారు. ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలు రైతులు కావడం గమనార్హం. 5 లక్షల మంది నిర్మించిన ఈ సినిమా పేరు మంథన్ కావడం గమనార్హం. వర్గీస్ కురియన్ జీవిత కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
వర్గీస్ కురియన్ శ్వేత విప్లవ పితామహుడిగా తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నారు. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడం కోసం వర్గీస్ కురియన్ ఎంతగానో కృషి చేశారు. గుజరాత్ పాడి రైతుల జీవితాలలో వెలుగులు నింపడానికి వర్గీస్ కురియన్ ఎంతగానో కృషి చేశారు. ప్రముఖ దర్శకులలో ఒకరైన శ్యామ్ బెనగల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్యామ్ బెనగల్ ఈ సినిమా నిర్మాణానికి రైతులు భాగస్వామ్యం వహించడం కరెక్ట్ అని భావించారు.
గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఈ ఆలోచనకు అంగీకరించగా రైతులు ఒక్కొక్కరు 2 రూపాయల చొప్పున ఇచ్చారు. 5 లక్షల మంది రైతులు ఈ విధంగా ఇచ్చిన డబ్బుతో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. 5 లక్షల మంది నిర్మించిన తొలి క్రౌడ్ ఫండింగ్ మూవీగా మంథన్ నిలిచింది. భారత్ లో తొలి క్రౌడ్ ఫండింగ్ మూవీ ఏదనే ప్రశ్నకు మంథన్ మూవీ పేరు సమాధానంగా మంథన్ మూవీ నిలవడం గమనార్హం.
మంథన్ సినిమా సక్సెస్ సాధించాలనే ఆలోచనతో అప్పట్లో పాడి రైతులు ఎడ్ల బండ్లలో థియేటర్లకు వచ్చి ఈ సినిమాను వీక్షించారు. ఈ సినిమాకు ఎన్నో జాతీయ పురస్కారాలు కూడా వచ్చాయనే సంగతి తెలిసిందే. గిరీష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.