Prashanth Neel: ప్రశాంత్ నీల్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా?

Advertisement

యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కేజీఎఫ్2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేజీఎఫ్2 సినిమాలో హైలెట్ గా నిలిచిన సన్నివేశాల్లో తల్లి సమాధి సీన్ ఒకటనే సంగతి తెలిసిందే. సినిమాలో రాకీ భాయ్ తల్లి సమాధిని పెకిలించి తీసుకొని వచ్చి కేజీఎఫ్ సామ్రాజ్యంలో సమాధిని కట్టిస్తారు.

Click Here To Watch NOW

ఈ సీన్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చడంతో పాటు ఫ్యాన్స్ కు ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయింది. ఈ సీన్ గురించి ప్రశాంత్ నీల్ తాజాగా మాట్లాడుతూ మా నాన్నమ్మ అంటే నాకు ఎంతో ఇష్టమని నాన్నమ్మకు కూడా నేను అంటే ఎంతో ప్రేమ అని వెల్లడించారు. నేను ఏమైనా అన్నా ఏం చేసినా నాన్నమ్మ పట్టించుకునేది కాదని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. నాన్నమ్మపై తాను కోప్పడినా ఆమె ప్రేమగానే చూసుకునేవారని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.

నేను తినకపోతే అమ్మమ్మ చాలా బాధపడే వారని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు. నాన్నమ్మ బ్రతిమాలుతూ ఆహారం తినిపించేదని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. నాన్నమ్మ చనిపోయిన సమయంలో సొంతంగా స్థలం లేకపోవడంతో ఏపీలోని మా ఊరిలో అంత్యక్రియలు చేశామని ప్రశాంత్ నీల్ అన్నారు. ఏదో ఒకరోజు నాన్నమ్మ సమాధిని వాకిట్లో పెట్టుకోవాలని తాను అనుకున్నానని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. నిజ జీవితంలో అలా చేయడం సాధ్యం కాదు కాబట్టి సినిమాలో ఆ సీన్ ను వాడుకున్నామని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.

కేజీఎఫ్2 ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేయగా ఫుల్ రన్ లో ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. కేజీఎఫ్2 సక్సెస్ తో ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగుతోంది. దేశంలోని టాప్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరిగా నిలుస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news