‘బిగ్ బాస్ 6’ ని మొన్నటి వరకు జనాలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ సీజన్ అంత ఆసక్తికరంగా సాగడం లేదు. హౌస్మేట్స్ ఎవ్వరూ కూడా జనాలు ఎక్కువగా చూడని వాళ్ళు రావడం.. టాస్కులు కూడా కొట్టుకోవడానికే అన్నట్టు ఉంటున్నాయి.అయితే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ను కలిసే ఫ్రీజ్ అండ్ రిలీజ్ టాస్క్ రన్ అవుతుంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంత తమ ఫ్యామిలీ మెంబర్స్ని కలుస్తున్నారు. ప్రతి సీజన్లోనూ ఈ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుంటుంది.
ఈ టాస్క్ లో ఇప్పటివరకు ఫైమా తల్లి, శ్రీసత్య తల్లిదండ్రులు,రోహిత్ తల్లి, ఆదిరెడ్డి భార్య వచ్చి ఎంటర్టైన్ చేశారు.లేటెస్ట్ ఎపిసోడ్ కు శ్రీహాన్‌కి కాబోయే భార్య సిరి వచ్చింది. ఈ లవ్ బర్డ్స్ గేధరింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. అంతేకాదు ఈ ఎపిసోడ్ ద్వారా తమ కొడుకును కూడా పరిచయం చేశారు. ఇతని పేరు చైతు అట. అయితే ఈ ఎపిసోడ్ చూశాక అందరిలోనూ ఓ డౌట్ మొదలైంది.
శ్రీహాన్ – సిరి లు రిలేషన్ షిప్ లో ఉన్నారు కానీ వీళ్ళకి బాబు ఎప్పుడు పుట్టాడు అని? మరోపక్క సిరి – శ్రీహాన్ ఓ అనాధని దత్తత తీసుకున్నారు.. ఆ బాబు పేరెంట్స్ కఠిన పేదరికంలో ఉండటం వల్ల ఆ బాబుని దత్తత తీసుకున్నారు అంటూ కథనాలు వినిపించాయి. నిజానికి చైతూని సిరి- శ్రీహాన్ లు దత్తత తీసుకున్న మాట నిజం. అలా అని అతను అనాథ కాదు. సిరి తన మేనమామ కొడుకునే దత్తత తీసుకుంది.
ఈ విషయాన్ని సిరి తల్లి శ్రీదేవి తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి కూడా ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా సిరి కోసం ఆమె హౌస్‌లోకి కూడా వెళ్లింది.ఆ తర్వాత ఆమె ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ బాబు గురించి చెప్పింది. ‘సిరి- శ్రీహాన్ లు పెంచుకుంటున్న బాబు ఎవరో కాదు.. మా తమ్ముడి కొడుకే.. సిరి బిగ్ బాస్ హౌస్‌లో ఉంది కాబట్టి.. చైతు వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉన్నాడు’ అంటూ క్లారిటీ ఇచ్చింది ఆ టైంలో..!
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..