రవితేజ హీరోగా వంశీకృష్ణ డైరెక్షన్ లో టైగర్ నాగేశ్వరరావు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా లాంఛ్ కాగా చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా కథను రవితేజ కంటే ముందు తాను విన్నానని సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని చిరంజీవి తెలిపారు.
సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుందని అయితే తనకు సమయం కుదరకపోవడంతో ఈ సినిమాకు అంగీకారం చెప్పలేకపోయానని చిరంజీవి అన్నారు. నేను టైగర్ నాగేశ్వరరావు సినిమాను చేయలేకపోయినా నా తమ్ముడు రవితేజ ఈ సినిమాను చేస్తున్నాడని చిరంజీవి చెప్పుకొచ్చారు. రవితేజకు ఈ సినిమా బాగా సూట్ అవుతుందని చిరంజీవి వెల్లడించారు. బాల్యంలో తాను చీరాలలో ఉండేవాడినని ఆ సమయంలో టైగర్ నాగేశ్వరరావు గురించి తాను కథలుకథలుగా విన్నానని చిరంజీవి తెలిపారు.
టైగర్ నాగేశ్వరరావుతో తన తండ్రి మాట్లాడారని బాల్యంలో టైగర్ నాగేశ్వరరావు చేసిన సాహసాల గురించి తండ్రి తనతో చెప్పారని చిరంజీవి చెప్పుకొచ్చారు. టైగర్ నాగేశ్వరరావు గురించి తనకు చాలా విషయాలు తెలుసని మెగాస్టార్ కామెంట్లు చేశారు. రవితేజకు జోడీగా ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాలతో పోలిస్తే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.
రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ నటించిన సినిమాలలో క్రాక్ మినహా మరే సినిమా హిట్ కాలేదు. కథల ఎంపికలో రవితేజ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ రెమ్యునరేషన్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. రవితేజ నటించిన ఖిలాడీ ఫిబ్రవరిలో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. రవితేజ భవిష్యత్తు ప్రాజెక్టులతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.