సినిమా ఇండస్ట్రీ వారికి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ.. ఒక సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గరినుండి గుమ్మడికాయ కొట్టే వరకు.. షూటింగ్ పూర్తయ్యాక జరిగే ఆడియో ఫంక్షన్స్ నుంచి సినిమా రిలీజ్ వరకు ప్రతీ తతంగానికి సరైన సమయం, సందర్భానికి తగ్గట్టు కచ్చితమూన ముహూర్తం ఫిక్స్ చేసుకుని కానీ దాని ప్రకారం పనులు మొదలు పెట్టరు.. అలాగే మన స్టార్లు మాంచి భోజన ప్రియులు కూడా.. సూపర్ స్టార్ కృష్ణ నుండి రెబల్ స్టార్ ప్రభాస్ వరకు.. మన టాలీవుడ్ హీరోలకున్న సెంటిమెంట్లు, ఆహారపు అలవాట్ల గురించిన ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు చూద్దాం..
ఎన్టీఆర్..
నటరత్న ఎన్టీఆర్‌కి తెల్లవారు జామున రెండు, రెండున్నర గంటలకే నిద్ర లేవడం అలవాటు.. వెంటనే ఓ చుట్ట కాల్చి.. ఫ్రెష్ అయ్యి ఇడ్లీ, దోశెలను అది కూడా నెయ్యితో కలిపి తినేవారు.. ఇక ప్రతిరోజూ ఒక ఫుల్ కోడి ఆయన ఫుడ్ మెనూలో ఉండాల్సిందే.. షూటింగులోనూ బాదం పాలు మొదలుకుని స్వీట్స్, మిరపకాయ బజ్జీలు వంటివి లాగించేసేవారు.. ఎంత తిన్నా ఇట్టే అరిగించుకోవడం ఆయనకు అలవాటే..
కృష్ణ..
సూపర్ స్టార్ కృష్ణకి గోంగూర చికెన్, చింత చిగురు మటన్ అంటే పిచ్చి ఇష్టమట.. చెన్నై పరిసరాల్లో షూటింగ్ అయితే మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి.. కాసేపు కునుకు తీసి అప్పుడు మళ్లీ లొకేషన్‌కి వెళ్లిపోయేవారట..
రజినీ కాంత్..
సూపర్ స్టార్ రజినీ కాంత్ స్వశక్తితో కష్టపడి పైకొచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.. ఆయన సినిమాల్లోకి రావడానికి ముందు బెంగుళూరులో బస్ కండక్టర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పటికీ అప్పుడు వేసుకున్న కండక్టర్ యూనిఫామ్‌ని జ్ఞాపకంగా దాచుకున్నారు..
చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవికి గోధుమ రవ్వ ఉప్మాలో మీగడ కలుపుకుని.. ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం అంటే మామూలు ఇష్టం కాదట..
బాలకృష్ణ..
నటసింహ నందమూరి బాలకృష్ణ ఆమ్లెట్ ఇష్టంగా తింటాడు.. అలాగే పలు వెజ్, నాన్ వెజ్ వంటకాలను కూడా ఇష్టంగా లాగిస్తాడట.. బాలయ్యకి నలుపు రంగు అంటే అరిష్టం అనే సెంటిమెంట్.. ఎవరైనా ఆ కలర్ షర్ట్ వేసుకొని ఎదురు పడ్డారా.. ఇక అంతే సంగతులు.. అలాంటి బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో పూర్తి స్థాయిలో నలుపు రంగు చొక్కా వేసుకోవడం విశేషం..
నాగార్జున..
కింగ్ నాగార్జునకి దైవ భక్తి లేదు.. దేవుళ్లను నమ్మడు అంటారు కానీ.. ఆయన ‘మానవ సేవు మాధవ సేవ’ అనే మాటను నమ్ముతాడట.. దైవ భక్తి తక్కువే కానీ అసలు మొత్తానికి లేకపోలేదు..
వెంకటేష్..
విక్టరీ వెంకటేష్ తన సినిమాల రిలీజ్ విషయంలో ఓ సెంటిమెంట్‌ని కచ్చితంగా పాటిస్తాడట.. తన సినిమాల ఫస్ట్ కాపీ తాలుకా రీళ్లను వెంకటేశ్వర స్వామి, నరసింహ స్వామి, మద్రాసు వడపళనిలోని కుమార స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో పూజలు జరిపించిన తర్వాతే ప్రదర్శించాలని కోరుకుంటాడు.. ఇది తండ్రి రామానాయుడు దగ్గరి నుంచి వెంకీ అలవరచుకొన్న ఆచారం..
కృష్ణంరాజు – ప్రభాస్..
రెబల్ స్టార్ కృష్ణం రాజు నుండి నట వారసత్వంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా అలవడ్డాయి డార్లింగ్ ప్రభాస్‌కి.. భీమవరం స్టైల్లో వీరు చేయించే పలు రకాల నాన్ వెజ్ వంటకాలు, బిర్యానీలు అదిరిపోతాయని చెప్తుంటారు తిన్నవారు.. అలాగే తమ ఇంటి ఫుడ్‌ని బాలీవుడ్ సెలబ్రిటీలకు సైతం రుచి చూపించాడు ప్రభాస్.. పెదనాన్నతో పాటు తాను కూడా భోజన ప్రియుడే మరి..
మహేష్ బాబు..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్‌నెస్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసిందే.. ఎంత తినాలో అంతే తింటాను.. ఏం కావాలన్నా తినొచ్చు కానీ పద్దతిగా తినాలి.. టైంకి తినాలని చెప్తుంటాడు..
జూనియర్ ఎన్టీఆర్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కెరీర్ ప్రారంభంలో ఓ డజను ఇడ్లీలను నెయ్యిలో ముంచుకుని తింటుండేవాడని చెప్తుంటారు.. తర్వాత కొన్ని అలవాట్లు మార్చుకున్నాడు తారక్.. తినడమే కాదు వండడంలోనూ తను బెస్ట్ ఛెఫ్ అని తన చేతి వంట రుచి చూసిన వారు చెప్తుంటారు. జూనియర్ బిర్యానీతో పాటు నాన్ వెజ్ కర్రీస్ కూడా బాగా చేస్తాడు..
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!