Vaishnavi Chaitanya: రూ.700తో కడుపునిండా అన్నం తిన్న రోజులు.. వైష్ణవి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఒకరు కాగా బేబీ (Baby) సినిమాతో ఓవర్ నైట్ లో ఈ బ్యూటీకి స్టార్ స్టేటస్ వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు సక్సెస్ కావడం కష్టమని ఇండస్ట్రీలో చాలామందికి అభిప్రాయం ఉండగా వైష్ణవి చైతన్య ఆ నెగిటివ్ సెంటిమెంట్ ను సైతం బ్రేక్ చేయడం జరిగింది. లవ్ మీ (Love Me) సినిమాతో భారీ సక్సెస్ దక్కకపోయినా ఈ బ్యూటీ చేతిలో ఆఫర్లు ఎక్కువగానే ఉన్నాయి.

Vaishnavi Chaitanya

సిద్ధు జొన్నలగడ్డకు (Siddu Jonnalagadda) జోడీగా ఒక సినిమాలో నటిస్తున్న వైష్ణవి ఒక సందర్భంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మా నాన్నకు సినిమాలు అంటే ఇష్టమని నాన్న చిరు వ్యాపారి అని ఆమె తెలిపారు. చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి మండపాల్లోని లడ్డూలు దొంగలించి రాబిన్ హుడ్ లా అందరికీ పంచిపెట్టిన సందర్భాలు అయితే ఉన్నాయని వైష్ణవి పేర్కొన్నారు. నాన్నకు బిజినెస్ లో లాస్ రావడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డామని ఆమె తెలిపారు.

ఒక బర్త్ డే పార్టీలో డాన్స్ చేస్తే 700 రూపాయలు వచ్చాయని ఆ డబ్బులు నా మొదటి సంపాదన అని ఆ డబ్బును ఇంటికి తీసుకెళ్లి ఇస్తే అమ్మ కళ్లంట నీళ్లు పెట్టుకుందని వైష్ణవి వెల్లడించారు. ఆరోజు ఆ డబ్బులతోనే బియ్యం కొని కడుపునిండా అన్నం తిన్నామని తెలిసిన తర్వాత సంతోషించానని వైష్ణవి చెప్పుకొచ్చారు. నీకెవరు ఛాన్స్ ఇస్తారంటూ బంధువులు హేళనగా మాట్లాడిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

బేబీ కథ వినగానే నేను చేయగలనా అని భయమేసిందని వైష్ణవి చెప్పుకొచ్చారు. బేబీ సినిమాలో నల్లగా కనిపించడానికి 15 లేయర్ల మేకప్ వేశారని వైష్ణవి చైతన్య పేర్కొన్నారు. బేబీ సినిమాకు నాకు ఉత్తమ నటి క్రిటిక్స్ అవార్డ్ వచ్చిందని ఆమె వెల్లడించారు. వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉండాలనేది నా లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు.

ఏళ్ల వయస్సులో సైతం అందుకే కష్టపడుతున్నా.. అమితాబ్ ఏమన్నారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus