‘కేజీయఫ్’ సినిమాలో ప్రతి విభాగమూ కీలకమే అని చెప్పాలి. అన్నీ సక్రమంగా, అద్భుతంగా ఉన్నాయి కాబట్టే.. రెండు పార్టులూ ఘనవిజయం అందుకున్నాయి. హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. గత కొన్నేళ్లుగా వీరి గురించి ప్రపంచం మాట్లాడుకుంటూనే ఉంది. మిగిలిన నటులు, సాంకేతిక నిపుణుల గురించి ‘కేజీయఫ్ 1’ టైమ్‌లోనే చాలా వరకు చెప్పుకున్నాం. అయితే రెండో పార్ట్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సినిమా ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి.
ఇంతటి పెద్ద సినిమాను ఎడిట్ చేసిన ఈ ఉజ్వల్ కులకర్ణి సీనియర్ ఎడిటర్ అనుకోకండి. కేవలం 19 ఏళ్ల నూనూగు మీసాల కుర్రాడే. అవును ‘కేజీయఫ్ 2’ ఎడిటర్ వయసు 20 ఏళ్ల లోపే. సినిమా విడుదలై, అందులో ఎడిటింగ్ పనితనం చూసిన తర్వాత ఇప్పుడు అందరూ అతని గురించే మాట్లాడుతున్నారు. ఉజ్వల్ ఎడిటింగ్ విభాగంలో డిగ్రీలు గట్రా పొందిన వాడు కాదు. ఫ్యాన్ మేడ్ ఎడిట్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలు ఎడిట్‌లు లాంటివి చేసుకుంటూ ఉండేవాడు.
అలా ‘కేజీయఫ్ 1’కి సంబంధించి ఓ ఫ్యాన్ ఎడిట్‌ను ఉజ్వల్ చేశాడట. ఆ వీడియోను చూసి ఉజ్వల్‌ను ప్రశాంత్ సంప్రదించాడట. ‘కేజీయఫ్ 2’ టీజర్ కట్ వర్క్‌ను అతని చేతిలో పెట్టాడు. ఆ పనితనం చూసి మురిసిపోయిన ప్రశాంత్.. మొత్తం ‘కేజీయఫ్ 2’ను ఉజ్వల్ చేతిలో పెట్టేశాడట. ఇప్పుడు మనం చూస్తున్న, చూసిన ‘కేజీయఫ్ 2’ ఎడిట్ వర్క్ చేసిందంతా ఉజ్వలేనట. దీంతో ఉజ్వల్ పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతోంది.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. 14న విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతోంది. ‘కేజీయఫ్ 1’ను మించి ఉందని కొందరు అంటుంటే, కాస్త అతిగా ఉందని అనేవారూ ఉన్నారు. అయితే వసూళ్లు మాత్రం అదిరిపోతున్నాయి. యశ్ – ప్రశాంత్ కాంబో సత్తా ఏంటో మరోసారి చూపిస్తోంది. అయితే పార్ట్ 3 కూడా ఉందంటున్నారు. అదెలా ఉంటుందో చూడాలి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!