డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా నాలుగు వేరియస్ జోనర్ సినిమాలు (Movies) ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లకు రాబోతున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైన ఈ సినిమాలు బజ్‌ను క్రియేట్ చేశాయి. డిసెంబర్ రెండు వారాలు కూడా పుష్ప 2 (Pushpa 2: The Rule) మేనియా నడిచింది. ఇక దీని తరువాత హిట్టయ్యే బొమ్మ ఎదవుతుందో చూడాలనే ఆసక్తి అందరికీ ఉంది. అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా నటించిన ‘బచ్చలమల్లి’ (Bachhala Malli) రియలిస్టిక్ కథాంశంతో వస్తోంది. సుబ్బు (Subbu Mangadevi) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యాక్షన్ బ్యాక్‌డ్రాప్ హైలైట్ గా నిలుస్తుంది.
ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. నరేష్‌కు గతంలో వచ్చిన సీరియస్ రోల్స్ సక్సెస్ ఇచ్చాయి. మరి ఈ సినిమా కూడా ఆ కేటగిరీలో చేరుతుందా అనేది వేచి చూడాలి. ఇక ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో నటించిన ‘సారంగపాణి జాతకం’ ’ (Sarangapani Jathakam) కూడా అదే రోజు థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇంద్రగంటి మోహన కృష్ణ (Mohana Krishna Indraganti) తన ఫేవరెట్ కామెడీ జోనర్ లో తీసుకువస్తున్న ఈ చిత్రం, జాతకాలు, చేతి రాతల కథాంశంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ప్రియదర్శి నటనతో పాటు రూప కొడవయూర్ హవాను ఈ సినిమాలో చూసే అవకాశం ఉంది. గత చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయిన ఇంద్రగంటి, ఈ సినిమా ద్వారా మళ్లీ తన గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఉపేంద్ర ‘UI’ కూడా ఆ రోజు విడుదల కానుంది. ఎప్పటికీ విభిన్నమైన ఐడియాలతో సినిమాలు (Movies) తీసే ఉపేంద్ర ((Upendra) ), ఈ సారి సైకలాజికల్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
గతంలో అతను రూపొందించిన ‘A’ సినిమా సీక్వెల్ గా ‘UI’ తెరకెక్కినట్లు చెబుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఊహాతీతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. తమిళం నుంచి రాబోతున్న ‘విడుదల 2’ (Vidudala Part 2) కూడా ఈ లిస్ట్‌లో ప్రత్యేకం. వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వంలో వచ్చిన మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక సూరి, విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సీక్వెల్ కథానాయకుల పోరాటాలను మరింత తీవ్రమైన స్థాయికి తీసుకెళ్తుందని టాక్. ఈ నాలుగు సినిమాలు అన్నీ విభిన్న జోనర్‌లో ఉండటంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలవా అనేది ప్రశ్న. వీటిలో బాక్సాఫీస్ రేసులో ఏది ముందు ఉంటుందో చూడాలి.