Varun Tej, Lavanya: ఇటలీలో ప్రారంభమైన మెగా ప్రిన్స్ పెళ్లి పనులు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ ఈ విషయాన్ని బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇలా ప్రేమలో విహరిస్తున్నటువంటి ఈ జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి పెద్దల అంగీకారం తీసుకున్నారు. ఇలా కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ జంట జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థపు వేడుకను జరుపుకున్నారు. ఇలా జూన్ 9వ తేదీ నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఈ జంట ఆగస్టు చివరి వారంలో పెళ్లి చేసుకోబోతున్నారనీ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.

అయితే వీరి (Varun Tej, Lavanya) పెళ్లి గురించి త్వరలోనే అధికారక ప్రకటన వెలబడబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు సమాచారం. మిస్టర్ సినిమా ద్వారా ఇద్దరు పరిచయం ఏర్పడింది. ఇక వీరి ప్రేమ విషయాన్ని ఇటలీలో బయట పెట్టుకున్నారట. అందుకే ఇటలీలోనే వీరి వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే కేవలం 50 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వీరి వివాహ వేడుక ఇటలీలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్నట్టు సమాచారం. ఇకపోతే వీరి వివాహం రాజరికపు పద్ధతిలో జరగబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు వెడ్డింగ్ ప్లానర్స్ ఇటలీలో వీరి వివాహ పనులు మొదలు పెట్టారని తెలుస్తోంది.

ఇలా ఘనంగా వివాహం చేసుకున్నటువంటి ఈ జంట తిరిగి హైదరాబాద్ చేరుకున్న తర్వాత సినీ సెలబ్రిటీల కోసం చాలా ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఇక వీరి వివాహ వేదికకు సంబంధించిన అన్ని విషయాలను కూడా త్వరలోనే అధికారకంగా తెలియజేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus