తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి హీరోగా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బాలకృష్ణ ఒకరు. నందమూరి హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించినటువంటి బాలయ్య ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇలా ఈయన సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలలో కొనసాగుతూ బాలకృష్ణ భారీ స్థాయిలోనే ఆస్తిపాస్తులు అన్నింటిని కూడా సంపాదించి పెట్టారని చెప్పాలి.
ఇక తన కుమార్తెల భవిష్యత్తు కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే బాలయ్య తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేసి మంచి ఉన్నత కుటుంబాలకే వారిని కోడలుగా పంపించిన సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజులలో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టబోతున్నారు. ఇలా బాలయ్య పిల్లల విషయంలో కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ వారి బాధ్యతలను కూడా చక్కగా తీర్చిదిద్దారు.
అయితే ఇలా తన పిల్లలు తన కుటుంబం అంత సంతోషంగా ఉన్నప్పటికీ (Balakrishna) బాలయ్యకు మాత్రం ఒక కోరిక అసలు తీరలేదట మరి బాలకృష్ణకు తీరని ఆ కోరిక ఏంటి అనే విషయానికి వస్తే… బాలయ్యకు ఆడపిల్లలంటే ఎంతో అభిమానం ప్రేమ అనే సంగతి మనకు తెలిసిందే అందుకే తన ఇద్దరి కూతుర్లను ఎంతో గారాభం చేసి పెంచారు . ఇలా కూతుర్లకు పెళ్లి చేసి పంపించడంతో తన ఇంట్లో ఒక ఆడపిల్ల కూడా లేకపోవడంతో బాలయ్య ఎంత బాధ పడ్డారట.
దీంతో తన కూతుర్లకు కూతురు కనక పుడితే తన మనవరాలుతో ఆడుకోవాలని కోరికగా ఉండేదట కానీ తన ఇద్దరు కుమార్తెలకు అబ్బాయిలు పుట్టడం విశేషం. మనవరాలితో ఆడుకోవాలని కోరిక బాలయ్యలో అలాగే ఉండిపోయిందట. అయితే కూతుర్లకు కూతుర్లకు పుట్టకపోయినప్పటికీ తన కుమారుడు మోక్షజ్ఞకు కూతురు పుడితే కనుక బాలయ్య కోరిక నెరవేరుతుందని చెప్పాలి.