Prabhas: వందల కోట్ల ఖర్చు చేసి కొత్త ఇంటికి శ్రీకారం చుట్టిన ప్రభాస్?

పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో ఇమేజెస్ సొంతం చేసుకున్నటువంటి ఈయన చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయినా కమర్షియల్ గా మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టాయని చెప్పాలి.

త్వరలోనే ప్రభాస్ నటించిన సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయనకు హైదరాబాద్ సిటీలో ఎన్నో ఇండ్లు ఉన్నప్పటికీ అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉండటం వల్ల అక్కడ ఉండటానికి ప్రభాస్ ఇష్టపడటం లేదట.

దీంతో సిటీ బయట తన డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని గతంలో రెండు ఎకరాల స్థలం కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ స్థలం కోసం ప్రభాస్ ఏకంగా 120 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వార్తలు వినిపించాయి అయితే తాజాగా ఆ స్థలంలో ఈయన కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలుస్తుంది. ఈ ప్రాంతంలో ఏకంగా 200 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభాస్ కొత్త ఇల్లు కట్టబోతున్నారని సమాచారం.

సిటీ బయట అయితే ప్రశాంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో (Prabhas) ప్రభాస్ ఇక్కడ ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారట. తన అభిరుచులకు అనుగుణంగా ఎంతో విశాలవంతంగా ఉండే ఇంటి నిర్మాణం కోసం 320 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారంటూ ఈ వార్త వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈయన ఒక్కో సినిమాకు సుమారు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus