పద్ధతిగా సంప్రదాయబద్ధ పాత్రల్లో నటించే హీరోయిన్లు… తాము గ్లామర్ ట్రీట్‌కి సిద్ధం అని చెప్పడానికి ఏం చేస్తారు? ఒకప్పుడు అయితే అలాంటి ఓ పాత్రను ఓకే చేసి… ‘నేను రెడీ’ అని చెప్పేవారు. ఇప్పుడు అయితే సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి.. గ్లామర్ ట్రీట్ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులు చూసి దర్శకనిర్మాతలు, హీరోలు ఆ నాయికను అలాంటి పాత్ర కోసం సంప్రదిస్తారు. ఈ మాట ఎవరూ, ఎక్కడా అధికారికంగా చెప్పకపోయినా ఆలోచన అదే అని చెప్పొచ్చు.
ఇప్పుడు ఇలాంటి ఆలోచనే సమంత చేస్తోంది అని అంటున్నారు నెటిజన్లు. దీనికి కారణం ఆమె కాస్ట్లీ గ్లామర్ ఫొటో షూట్లే అని అంటున్నారు. రీసెంట్గా సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే… ఆసక్తికరమైన ఫొటోలు చాలానే కనిపిస్తాయి. సమంత హీరోయిన్గా ఎంటర్ అయ్యి, స్టార్ హీరోయిన్ అయ్యాక ఇలాంటి ఫొటో షూట్లు ఎక్కువగా చేసింది. గ్లామర్ డోస్‌ను వడ్డించడంలో తానెవరికీ తక్కువ కాను అని చెప్పడం ఆమె ఉద్దేశం అని ఆ ఫొటోలు చూస్తే అప్పుడు అనిపించేది. ఇప్పుడు కూడా అదే అనిపిస్తోంది.
వివిధ బ్రాండ్లు, ఫ్యాషన్ మ్యాగజీన్ల కోసం సమంత రీసెంట్ ఫొటో షూట్లు ఇస్తోంది. ఒక్కో ఫొటోలో ఒక్కోలా అందాలను వడ్డించింది. రూ. 5 లక్షల ఫ్యాషనబుల్ డ్రెస్‌లో బ్యాక్ అందాలు పరిచిన విధానం అయితే హైలైట్. ఇక స్విమ్ సూట్ సంగతి సరేసరి. అయితే ఇప్పుడు సమంత ఎందుకీ ట్రీట్ ఇస్తోంది అనేదే ఇక్కడ ప్రశ్న. ఆమెకు ఆమె సినిమాలకు గ్యాప్ తీసుకుంది, అంతకుముందు గ్లామర్ పాత్రలకు దూరంగా జరిగింది. దీంతో ఇప్పుడు ఇదంతా చేస్తోంది మళ్లీ గ్లామర్ క్వీన్‌గా తనను చూడాలని చెప్పడానికా అనే ప్రశ్న వస్తోంది.
తనలో (Samantha) గ్లామర్ పాళ్లు ఇంకా తగ్గలేదని, కుర్ర హీరోయిన్లకు తానేమీ తక్కువ కాదు. మళ్లీ స్టార్ హీరోలతో సినిమాలకు సిద్ధమే. హీరోయిన్ ఓరియెంటెడ్, క్యారెక్టర్ బేస్డ్గా కాకుండా ఇలా కూడా సినిమాలకు నన్ను ప్రిఫర్ చేయొచ్చు అని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతోందా అనేది నెటిజన్ల డౌటానుమానం.