Uday Kiran: తన ప్రేమను రిజెక్ట్ చేసి ఉదయ్ కిరణ్ తప్పు చేశారా?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈయన మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా లవర్ బాయ్ గా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి ఉదయ్ కిరణ్ కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు.

సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వరుస హిట్టు సినిమాలతో దూసుకుపోతున్నటువంటి ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఉదయ్ కిరణ్ సినిమా వస్తుంది అంటే చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోలు కూడా తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంత గొప్ప స్థాయికి ఎదిగినటువంటి ఈయనకు వరుస ఫ్లాప్ సినిమాలు ఎదురయ్యాయి. దీంతో అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరికి మరణించారు.

అయితే ఈయన కెరియర్ ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఆయన చేసిన తప్పే కారణమంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే నటి అనితను ప్రేమించారట ఇలా వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతూ ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల ఈయన తన ప్రేమకు బ్రేకప్ చెప్పారని తెలుస్తుంది. నువ్వు నేను సినిమాలో కలిసినటువంటి వీరిద్దరూ ఆ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారట.

అప్పుడప్పుడే కెరియర్లో ముందుకు వెళ్తున్న (Uday Kiran)  ఈయన ప్రేమ అంటూ కెరియర్ ను నాశనం చేసుకోలేక ఆమెను దూరం పెట్టారట. దీంతో అనిత కూడా తనకు దూరమయ్యారు. ఇలా వీరిద్దరికీ బ్రేకప్ కనుక కాకపోయి ఉంటే ఉదయ్ కిరణ్ కెరియర్ మరోలా ఉండేదని ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రస్తుత హీరోలను మించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేవారు అంటూ ఈ వార్త వైరల్ అవుతుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus