స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడాల్లేకుండా అందరు హీరోల సినిమాలకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక కావడంతో పాటు థమన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలు సైతం అంచనాలకు అందని స్థాయిలో విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. అయితే థమన్ ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి ఎన్నో కారణాలున్నాయి.
చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థమన్ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడరు. సినిమాను బట్టి థమన్ 50 లక్షల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. థమన్ ఇప్పటికే దాదాపుగా అందరు స్టార్ హీరోల సినిమాలకు పని చేశారు. కెరీర్ తొలినాళ్లలో థమన్ కాపీ క్యాట్ అని అతని పాటలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదని విమర్శలు వ్యక్తమయ్యాయి.
అయితే విమర్శలను దృష్టిలో పెట్టుకొని మారిన థమన్ తన రెమ్యునరేషన్ లో ఎక్కువ మొత్తం మ్యూజిక్ కోసమే ఖర్చు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సింగర్లను రప్పిస్తూ ప్రతి పాట హిట్టయ్యే విధంగా థమన్ సత్తా చాటుకున్నారు. థమన్ నేపథ్య సంగీతం కూడా సినిమాలకు హైలెట్ గా నిలుస్తుండటం గమనార్హం. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సైతం థమన్ లైవ్ పెర్ ఫార్మెన్స్ ద్వారా ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంటే అతిశయోక్తి కాదు.
స్టార్ హీరోలు సైతం థమన్ తో ఒక సినిమాకు పని చేస్తే తర్వాత సినిమాలకు కూడా థమన్ కు అవకాశాలు ఇస్తుండటం గమనార్హం. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా మరెన్నో విజయాలను అందుకోవాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. థమన్ ను విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తూ ఉండటం గమనార్హం.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!