Bheemla Nayak: అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు అంటున్న నిర్మాత!

‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ను పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నాడు అనగానే తెలుగు రీమేక్‌ క్రేజ్‌ నాలుగైదింతలు అయిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కారణం… సినిమా టైటిల్‌, టీజర్‌ వీడియోలు అంటే అతిశయోక్తి కాదు. కారణం మలయాళ మాతృక పెద్ద మల్టీస్టారర్‌ సినిమా. అందుకుతగ్గట్టే సినిమా పేరు, ప్రచారం సాగింది. కానీ తెలుగులోకి వచ్చేసరికి సినిమా పేరు సోలో హీరోకు పెట్టినట్లుగా ఉంది. దీంతో సినీ విమర్శకులు, తటస్థ అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అయితే నిర్మాత వెర్షన్‌ వేరేలా ఉంది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్రబృందం ఇటీవల సినిమా పేరును ఓ వీడియోతో అధికారికంగా ప్రకటించింది. ఆ వీడియోలో మొత్తంగా పవన్‌ కల్యాణ్‌ మాత్రమే కనిపిస్తున్నాడు. ఇంకో హీరో అంటూ ఇన్నాళ్లూ చెప్పిన రానా కనీసం ఒక్కటంటే ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనిపించలేదు. దీంతో ‘మల్టీస్టారర్‌ను సింగిల్‌ స్టారర్‌’ చేసేశారా అంటూ సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. అలాంటి ఓ ట్వీట్‌ కింద చిత్ర నిర్మాత అయిన సూర్యదేవర నాగవంశీ రిప్లై ఇచ్చారు. అదిప్పుడు వైరల్‌గా మారింది.

సినిమాకు సంబంధించి ఈ ప్రచార వీడియోను చూసి ఓ నిర్ణయానికి వచ్చేయొద్దు. సినిమా ప్రచారం ఓ ఆర్డర్‌లో జరుగుతుంది. అప్పటివరకు వెయిట్‌ చేయండి అని రాసుకొచ్చారు నిర్మాత. అంటే సినిమా పేరు ఇదేనా అనే ఓ విచిత్ర ప్రచారం మొదలైంది. ఎందుకంటే ఇద్దరు హీరోల పేర్లు వచ్చేలా సినిమా పేరు ఉంటే… మాతృకకు న్యాయం చేసినవాళ్లవుతారు. అయితే ప్రకటించిన సినిమా పేరును మళ్లీ మార్చే సాహసం చేస్తారా అనేది చూడాలి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus