Bhola Shankar: చిరుతో మెహర్ రమేష్ సినిమా.. ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో సినిమా అనగానే ఎవరూ నమ్మలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు కూడా సెట్స్ పైకి వెళ్లినప్పుడు చూద్దాంలే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తుండడంతో ఇక ప్రాజెక్ట్ పక్కా అని తెలుస్తోంది. నిజానికి ‘శక్తి’, ‘షాడో’ లాంటి సినిమాల తరువాత మెహర్ రమేష్ తో సినిమా చేయడానికి ఏ హీరో ముందుకు రాలేదు. అలాంటిది మెగాస్టార్ తో సినిమా సెట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అది కూడా కొత్త కథ కాదు. ‘వేదాళం’ రీమేక్. ఓ భాషలో బాగా ఆడిన సినిమాను రీమేక్ చేయడం చిరుకి కొత్తేమీ కాదు. కానీ అలా రీమేక్ చేసినప్పుడు ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మార్పులు, చేర్పుల విషయంలో ఇన్వాల్వ్ అవుతుంటారు చిరు. కానీ ‘వేదాళం’ రీమేక్ విషయంలో ఇవేవీ జరగలేదు. నిజానికి ‘వేదాళం’ రీమేక్ చేయాలనే ఆలోచన చిరుది కాదట. ఈ సినిమా చూసిన మెహర్ రమేష్ తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా మార్చి ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట.

తాను కథ రాసుకున్నప్పుడు హీరోగా చిరంజీవిని అనుకోలేదట. కానీ సీసీసీ అంటూ చిరు ఓ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మెహర్ రమేష్ దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారట. ఆ సమయంలో చిరు.. ఏమైనా కథలు ఉంటే చెప్పమని అడిగితే.. వెంటనే ‘వేదాళం’ రీమేక్ గురించి, ఆయన చేసిన మార్పుల గురించి మెహర్ రమేష్ చెప్పారట. చిరుకి బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేస్తానని అన్నారట. చిరు మాటివ్వడంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ రంగంలోకి దిగి ప్రాజెక్ట్ ని సెట్ చేసింది. రీసెంట్ గా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus