సినీ పరిశ్రమలో ఏదీ అంత ఈజీ కాదు. ప్రయత్నిస్తే ఏదీ కష్టం కూడా కాదు. ఒక్కోసారి కొంతమంది తీసుకునే నిర్ణయాలు ఊహించని మంచి ఫలితాలు ఇస్తాయి. మరోసారి ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ప్రాజెక్టులు డిజప్పాయింట్ చేస్తాయి. దేనిని కూడా అంత ఈజీగా జస్టిఫై చేయలేము. అద్భుతాలు అలాగే జరుగుతాయి. 1990 లో ఇదే అద్భుతం జరిగింది. ఆ టైంలో నందమూరి బాలకృష్ణ వరుస ప్రాజెక్టులతో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు.
‘లారీ డ్రైవర్’ ‘తల్లిదండ్రులు’ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ వంటి సినిమాలతో ఆయన క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రోజులవి. అలాంటి టైంలో దర్శకులు సింగీతం శ్రీనివాసరావు బాలయ్యని కలిసి ఓ కథ వినిపించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఆ టైంలో బాలయ్య కథలు వినేందుకు సిద్ధంగా లేరు. పైగా ఆ తర్వాత ‘రౌడీ ఇన్స్పెక్టర్’ ‘అశ్వమేధం’ వంటి పెద్ద బడ్జెట్ సినిమాలకు ఆయన ఓకే చెప్పేసి ఉన్నారు.
దీంతో సింగీతం గారు కథ చెప్పడానికి వస్తున్నారు అని తెలుసుకుని ‘ఇప్పుడు వద్దులే’ అని కబురు పంపారట. కానీ సింగీతం గారు పట్టుబట్టడంతో ‘సరే ఒకసారి కథ వినేసి రిజెక్ట్ చేద్దామని’ బాలయ్య.. ఆయన్ని కలిసేందుకు ఒప్పుకున్నాడట. అదే ‘ఆదిత్య 369’ కథ. ఒక్కసారి కథ వినడం మొదలుపెట్టిన తర్వాత తెలీకుండానే 4 గంటల పాటు విన్నాడట బాలయ్య. మధ్యలో సింగీతంని డౌట్స్ అడగడం కాన్వర్జేషన్ మరింతగా పెరగడం.. ఇలా జరిగిందట. ‘నో చెప్పడానికి ఛాన్స్ లేకుండా చేశారు’ అంటూ బాలయ్య.. ‘ఆదిత్య 369’ కి ఓకే చెప్పేశాడట.
దీనికి ముందు విన్న ‘లారీ డ్రైవర్’ ‘అశ్వమేధం’ సినిమాలు కొన్ని కారణాల వల్ల డిలే అయ్యాయి. దీంతో వెంటనే ‘ఆదిత్య 369’ ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. త్వరగా కంప్లీట్ చేసి 1991 జూలై 18కి రిలీజ్ చేశారు. ఇలాంటి పెద్ద బడ్జెట్ సినిమాలకి హీరో సహకారం చాలా అవసరం. అప్పుడు బాలయ్య అన్నిటికీ రెడీ అయ్యాడు కాబట్టే.. ఇలాంటి క్లాసిక్ మన ముందుకు వచ్చింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 34 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అది మేటర్.