టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అక్కినేని నాగార్జున(Nagarjuna), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), విక్టరీ వెంకటేష్(Venkatesh)..లు ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలు లాంటి వారు. వీళ్ళకి ఫ్యాన్ బేస్ ఇప్పటికీ సేమ్ ఉంది. చిరు, బాలయ్య.. ల రేంజ్ కొంచెం ఎక్కువగా ఉన్నా, నాగ్, వెంకీ తమ మార్క్ ప్రయోగాత్మక సినిమాలతో ఇప్పటికీ తమ సత్తా చాటుతున్నారు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. చిరు తనయుడు చరణ్ (Ram Charan) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ అయిపోయాడు.
కాదు కాదు గ్లోబల్ స్టార్ అయిపోయాడు. నాగార్జున ఇద్దరు కొడుకులు నాగ చైతన్య,(Naga Chaitanya) అఖిల్ (Akhil Akkineni) ..లు మిడ్ రేంజ్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. మరి వెంకటేష్ కొడుకు సంగతేంటి? అనే చర్చ చాలా కాలంగా జరుగుతుంది. వెంకటేష్ కి కొడుకు ఉన్నాడు.అతని పేరు అర్జున్. ఇతను మీడియాలో కనిపించింది చాలా తక్కువ. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ( Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా ఆడియో ఫంక్షన్లో ఇతను మహేష్ (Mahesh Babu) కొడుకు గౌతమ్ తో పాటు కనిపించాడు.
ఆ తర్వాత క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన మహేష్ ఫ్యామిలీతో కలిసి కనిపించాడు. ఇప్పుడు అర్జున్ పెద్దోడు అయ్యాడు. కానీ ఇతని ఫోటోలు ఒక్కటి కూడా బయటకు రాలేదు. వెంకటేష్ ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి హాజరయ్యాడు. అందులో అర్జున్ ప్రస్తావన వచ్చింది. ప్రస్తుతం ‘తను అమెరికాలో చదువుకుంటున్నాడు. సినిమాలంటే అతనికి ఆసక్తి ఉంది’ అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చాడు. సో అర్జున్ హీరోగా డెబ్యూ ఇవ్వడం ఖాయం అని చెప్పొచ్చు.
అయితే దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఇప్పటికే సురేష్ బాబు (D. Suresh Babu) కొడుకు రానా (Rana) హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇతను స్టార్ అయితే కాలేదు కానీ.. విలక్షణ నటుడిగా పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇక రానా తమ్ముడు అభిరామ్ హీరోగా నిలబడే అవకాశాలు ఎంత మాత్రం కనిపించడం లేదు. మరి వెంకటేష్ కొడుకు అర్జున్ అయినా హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ అవుతాడా? అనేది తెలియాల్సి ఉంది.