Jr NTR, Koratala Siva: కొరటాల కథలో అవి లేవని తారక్ ఫీలయ్యారా?

తారక్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అటు ఎన్టీఆర్ ఇటు కొరటాల శివ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో ఈ గాసిప్స్ కు సంబంధించి క్లారిటీ రావడం లేదు. అయితే ఈ సినిమా అంతకంతకూ ఆలస్యం కావడానికి కథే కారణమని సమాచారం.

కొరటాల శివ చెప్పిన కథలో ఫస్టాఫ్ ఎన్టీఆర్ కు బాగా నచ్చిందని అయితే సెకండాఫ్ లో ఎలివేషన్ సీన్లు ఆశించిన విధంగా లేకపోవడంతో తారక్ ఫీలయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తారక్ మెచ్చేలా సెకండాఫ్ లో కీలక మార్పులు చేయడంలో కొరటాల శివ బిజీగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ సినిమా ఆలస్యమవుతున్నా ఎన్టీఆర్ లైనప్ అయితే మారే అవకాశం లేదని తెలుస్తోంది. ఆచార్య సినిమా ఫలితం వల్ల కొరటాల శివను బ్లైండ్ గా నమ్మి ఎన్టీఆర్ ముందుకు వెళ్లే అవకాశం అయితే లేదు.

అదే సమయంలో కొరటాల శివ టాలెంట్ ను సైతం తక్కువగా అంచనా వేయడం కరెక్ట్ కాదనే సంగతి తెలిసిందే. కొరటాల శివకు సైతం తర్వాత సినిమాతో సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ 30 గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వెరైటీ ఆయుధాలతో ఎన్టీఆర్ గ్లింప్స్ లో కనిపించగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి. కొరటాల శివ సినిమా తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించనున్నారు. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus