Pushpa 2 : బన్నీ అభిమానులకు టెన్షన్ తగ్గినట్టేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రిలియంట్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్లలో సుకుమార్ ఒకరనే సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ సంచలన విజయం సాధించడంతో పుష్ప ది రూల్ స్క్రిప్ట్ పై ఇన్నిరోజులు దృష్టి పెట్టిన సుకుమార్ స్క్రిప్ట్ ను లాక్ చేశారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని సమాచారం అందుతోంది. అతి త్వరలో ఈ సినిమాకు పూజ చేయనున్నారని తెలుస్తోంది.

హైదరాబాద్ లో తెరకెక్కించే సన్నివేశాలతో షూటింగ్ మొదలవుతుందని స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా షూటింగ్ లో పాల్గొంటారని బోగట్టా. సుకుమార్ ఈ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆగష్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైతే వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. పుష్ప2 మూవీ షూట్ మొదలవుతుండటంతో బన్నీ ఫ్యాన్స్ కు టెన్షన్ తగ్గినట్టేనని చెప్పవచ్చు.

బన్నీ పుష్ప2 సినిమా విడుదలైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బన్నీ ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. బన్నీతో ఒక్క సినిమా అయినా చేయాలని చాలామంది డైరెక్టర్లు ప్రయత్నిస్తున్నారు. రాజమౌళి అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

రాజమౌళి మహేష్ బాబు సినిమాను పూర్తి చేసి బన్నీతో సినిమా తీయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి రాజమౌళి అల్లు అర్జున్ పై దృష్టి పెడతారో లేదో చూడాల్సి ఉంది. బన్నీ రాజమౌళి పలు సందర్భాల్లో ఒకే వేదికపై కనిపించినా సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదనే సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు బన్నీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus