ప్రభాస్ ని మించిపోయే క్యారెక్టర్ అదేనా..!

రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తో చేస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఇప్పటివరకూ పౌరాణిక పాత్రలు చేయని ప్రభాస్ ఈసినిమాలో రాముడిగా కనిపించబోతున్నాడు. ఆదిపురుష్‌ సినిమాలో రాముడిగా ఎలా ఉంటాడన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. అంతేకాదు, దీనివల్ల ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇక దీన్ని మరింత పెంచే వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అదేంటంటే , ఆదిపురుష్‌ లో రావణుడిగా బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నాడు. ఇందులో ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. సరికొత్తగా ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేయబోతున్నారట. ప్రభాస్ ని మించేలా అంటే రాముడి పాత్రని తలపించేలా రావణ్ క్యారెక్టర్ ఉంటుందని చెప్తున్నారు. ఆదిపురుష్‌ లో రావణుడు 9 అడుగుల ఎత్తులో కనిపిస్తాడట. సైఫ్‌ ని ఆ రకంగా చూపించడానికి మేకప్‌ తో పాటు గ్రాఫిక్స్‌ ని కూడా సిద్ధం చేసినట్లుగా సమాచారం.

పదితలల రావణుడు స్క్రీన్ పైన ఎలా ఉండబోతున్నాడు అనేది ఇప్పట్నుంచే ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా ఆసక్తికరమే. అదీ మేటర్.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus