Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఇంతలో ఎన్నెన్ని వింతలో

ఇంతలో ఎన్నెన్ని వింతలో

  • April 6, 2018 / 04:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంతలో ఎన్నెన్ని వింతలో

నందు, కృష్ణతేజ, త్రిషూల్, నరసింహ, పూజ రామచంద్రన్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం “ఇంతలో ఎన్నెన్ని వింతలో” ఒకరోజులో జరిగే కథాంశంగా తెరకెక్కిన ఈ కామెడీ థ్రిల్లర్ ద్వారా వినాయక్ అసోసియేట్ వరప్రసాద్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. చాన్నాళ్లుగా సరైన రిలీజ్ డేట్ దొరక్క ల్యాబ్ లో ఉండిపోయిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ (ఏప్రిల్ 6) బయటపడింది.iev-1

కథ : రాత్రి పార్టీలో పూటుగా తాగేసి ఉదయం లేచేసరికి విష్ణు (నందు), తేజ (నరసింహ), సయ్యద్ (కృష్ణతేజ), ప్రదీప్ (త్రిషూల్) రకరకాల పరిస్థితుల్లో, పరిసరాల్లో ఉంటారు. నిజానికి ఈ నలుగురు కలిసి పార్టీ చేసుకొన్నారు. సాయంత్రం తాను ప్రేమించిన వందన (సౌమ్య వేణుగోపాల్)తో పెళ్లి అనగా.. అసలేం జరిగిందో కూడా గుర్తులేకపోగా, తాము చేసిన తప్పేంటో కూడా తెలియక తికమకపడుతుంటారు ఈ నలుగురు. అప్పుడు కథలోకి ఎంటరవుతాడు నాగోల్ నాని (గగన్ విహారి). అసలు ఈ నలుగురి జీవితాలు ఇలా కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడడానికి కారణం తార (పూజ రామచంద్రన్) అని చెప్పడంతోపాటు.. మరో 2 గంటల్లో తారను తీసుకొచ్చి తనముందు నిల్చోబెట్టకపోతే విష్ణు పెళ్లి కూడా జరగదని బెదిరిస్తాడు.

అసలు తార ఎవరో కూడా గుర్తులేనంతగా తాగేసిన విష్ణు రాత్రి జరిగిన విషయాలను ఎలా రీకలెక్ట్ చేసుకున్నాడు? తన స్నేహితులను ఎలా కాపాడుకోగలిగాడు? ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడగలిగాడా లేదా? వంటి ప్రశ్నలకు సమాధాన సమాహారమే “ఇంతలో ఎన్నెన్ని వింతలో” చిత్రం.iev-4

నటీనటుల పనితీరు : నందు ఎప్పట్లానే తనదైన బాణీలో నటించాడు. అయితే.. నిన్నమొన్నటివరకూ పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినట్లే కనిపించి మాయమైపోయిన కృష్ణతేజ ఈ చిత్రంలో సయ్యద్ పాత్రలో తెలంగాణ యాసలో కడుపుబ్బ నవ్వించాడు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో “కృష్ణతేజ-ఆర్.కె” కాంబినేషన్ కామెడీ ఎపిసోడ్స్ బాగుంటాయి. అలాగే.. “ఫన్ బకెట్” ఫేమ్ త్రిషూల్ మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించాడు. కాకపోతే ఎక్స్ ప్రెషన్స్ విషయంలో ఇంకాస్త పరిణితి చెండాల్సి ఉంది. ఇక పెళ్ళికి ముందే శోభనం చేసుకోవాలని పరితపించే యువకుడిగా నరసింహ పర్వాలేదనిపించుకొన్నా.. అతడు సెక్స్ రాకెట్ లో ఇరుక్కొనే సన్నివేశాలు భలే నవ్విస్తాయి.

హీరోయిన్ సౌమ్య వేణుగోపాల్ అందం, అభినయంతో పెద్దగా ఆకట్టుకోకపోయినా.. పూజ రామచంద్రన్ మాత్రం తార పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ఆమె కళ్లలోని మత్తు ప్రేక్షకుడి మనసుకి తాకడం ఖాయం.

అయితే.. తండ్రి, తల్లి పాత్రలకు మరీ సీరియల్ ఆర్టిస్టులను కాకుండా కాస్త ప్యాడింగ్ ఆర్టిస్ట్స్ ను తీసుకొని ఉంటే బాగుండేది. విలన్ గా గగన్ విహారీ అలరించాడు.iev-2

సాంకేతికవర్గం పనితీరు : యాజమాన్య పాటలు, ఆ పాటలకు సురేష్ గంగుల సమకూర్చిన సాహిత్యం బాగున్నాయి. నేపధ్యం సంగీతం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. కథనంలో మంచి స్పీడ్ ఉన్నప్పుడు సరైన బీట్ లేక సీన్ సరిగా ఎలివేట్ అవ్వలేదు. ఎస్.మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. అలాగే.. నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

దర్శకుడు కథని మరీ ఎక్కువ మలుపులు తిప్పకుండా సబ్ ఫ్లాట్స్ ఎక్కువ లేకుండా స్క్రీన్ ప్లేతో మాయ చేద్దామనే ప్రయత్నం బాగుంది కానీ.. కథనాన్ని ఇంకాస్త వేగంగా నడిపించి ఉంటే ఫలితం ఇంకాస్త బాగుండేది. అప్పటికీ.. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నప్పటికీ.. రెండు గంటల సినిమాలో కూడా ల్యాగ్ అనిపిస్తుంది. చిన్న చిన్న పొరపాట్లు మినహా దర్శకుడు వరప్రసాద్ తన ప్రతిభను పర్వాలేదు అనిపించేలా చాటుకొన్నాడు. తదుపరి చిత్రాల విషయంలో స్క్రీన్ ప్లే పరమైన జాగ్రత్తలు తీసుకొంటే మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకొనే లక్షణాలున్నాయి.iev-5

విశ్లేషణ : రొటీన్ కమర్షియల్ సినిమాలకంటే కాస్త బెటర్ మూవీ “ఇంతలో ఎన్నెన్ని వింతలో”. కాస్త ల్యాగ్ ను భరించగలిగితే రెండు గంటలపాటు హ్యాపీగా కృష్ణతేజ కామెడీ, పూజ రామచంద్రన్ క్యారెక్టర్, నరసింహ కామెడీ ఎపిసోడ్స్ ను ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటకు రావచ్చు. అయితే.. ‘రంగస్థలం, చల్ మోహన్ రంగ” చిత్రాల తాకిడికి ఈ చిన్న సినిమా నిలవగలుగుతుందా అనేది ప్రశ్నార్ధకం.iev-3

రేటింగ్ : 2/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Inthalo Ennenni Vinthalo Movie Review
  • #Inthalo Ennenni Vinthalo Review
  • #Inthalo Ennenni Vinthalo Review in Telugu
  • #Nandu
  • #Pooja Ramachandran

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

3 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

5 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

6 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

6 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

7 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

4 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

4 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

8 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

8 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version